ఎస్‌ఐ పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2022-08-08T04:42:29+05:30 IST

ఎస్‌ఐ(పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) రాత పరీక్ష నారాయణపేట జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పోలీస్‌ బందోబస్తు నడుమ పరీక్ష నిర్వహించారు.

ఎస్‌ఐ పరీక్ష ప్రశాంతం
హాల్‌ టికేట్‌ను పరిశీలిస్తున్న అధికారులు

- 1,156 మంది హాజరు.. 62 మంది గైర్హాజరు

- కేంద్రాల వద్ద భారీ బందోబస్తు 

- కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ వెంకటేశ్వర్లు

నారాయణపేట క్రైం, ఆగస్టు 7 : ఎస్‌ఐ(పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) రాత పరీక్ష నారాయణపేట జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పోలీస్‌ బందోబస్తు నడుమ పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,156 మంది హాజరు కాగా, 62 మంది గైర్హాజర య్యారు. 10 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, అభ్యర్థులు 8:30 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. తొమ్మిది గంటలకు కేంద్రాల లోపలికి అనుమతించారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు సేకరించి, హాల్‌ టికెట్‌లను పరిశీలించారు. ఆ తర్వాత లోపలికి అనుమతించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని పోలీసులు ముందుగానే హెచ్చరించడంతో ఆలస్యంగా కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థులు ఉరుకులు, పరుగులతో వచ్చారు. ఎలక్ర్టానిక్‌ వస్తువులు, వాచ్‌లు, క్యాలిక్లేటర్‌ లను అనుమతించలేదు. కేంద్రాలను ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేంద్రాల వద్ద గల జిరాక్స్‌ సెంటర్లు, ఇం టర్నెట్‌ సెంటర్లను మూయించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి, ఇత రులను పరిసరాల్లోకి అనుమతించకుం డా చర్యలు తీసుకున్నారు. నారాయణ పేటలో మొదటి సారిగా ఎస్‌ఐ ప్రిలి మనరి రాత పరీక్ష నిర్వహించగా ఆ యా పరీక్షా కేంద్రాల దగ్గర నోడల్‌ అఽ దికారి డీసీఆర్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర రావు, డీఎస్పీ సత్యనారాయణ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల రీజినల్‌ కోఆర్డీనేటర్‌ దేవసేన ఆధ్వర్యం లో ప్రిలిమనరి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 240 మందికి 228 మంది హాజరు కాగా 12 మంది గైర్హాజరయ్యారు. సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో 240 మందికి 232 మంది హాజరు కాగా ఎనిమిది మంది గైర్హాజ రయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 498 మందికి 471 మంది హాజరు కాగా 27 మంది హాజరుకాలేదు. సాయి కళాశాలలో 240 మందికి 225 మంది హాజరు కాగా 15 మంది హాజరుకాలే దు.  పరీక్ష ప్రశాంతంగా ముగియడం తో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.





Updated Date - 2022-08-08T04:42:29+05:30 IST