Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్యపై ఎస్ఐ దాడి

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు కోర్టు ఆవరణలో తన భార్యపై ఎస్ఐ నాగార్జున దాడి చేశాడు. 2017లో ప్రేమించి లావణ్యను నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తూ భార్యను వదిలేశాడు. అనంతరం 2019లో విడాకుల కోసం కోర్టును ఎస్ఐ ఆశ్రయించాడు. వాయిదా కోసం కోర్టుకు భార్య లావణ్య వచ్చింది. కోర్టు ఆవరణలో భార్య లావణ్య, అడ్డొచ్చిన అత్తామామలపై నాగార్జున దాడి చేశాడు. గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్సై నాగార్జున వీఆర్‌లో ఉన్నాడు. 


Advertisement
Advertisement