Siని అరెస్టు చేసిన Cid

ABN , First Publish Date - 2022-06-16T16:19:20+05:30 IST

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాల అక్రమాల కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసింది. రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి

Siని అరెస్టు చేసిన Cid

                    - ఎస్‌ఐ నియామకాల అక్రమాలపై కొనసాగుతున్న దర్యాప్తు


బెంగళూరు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాల అక్రమాల కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసింది. రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ స్వగ్రామం మాగడి పరిధిలోని చిక్కకళ్య గ్రామానికి చెందిన ఎస్‌ఐ హరీశ్‌ 2019 బ్యాచ్‌కు చెందిన వాడు. మూడేళ్లుగా బ్యాడరహళ్లి స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. హైగ్రౌండ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాఖలైన 14 మంది అభ్యర్థులపైకి దిలీప్ ను అరెస్టు చేశారు. అతడి నుంచి సేకరించిన సమాచారం మేరకు రెండురోజులక్రితం హరీశ్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు ప్రకటించారు. దిలీప్‌ కూడా చిక్కకళ్య గ్రామానికి చెందినవాడే. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉంది. హరీశ్‌ ద్వారానే దిలీప్‌ కూడా అక్రమమార్గంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కావాలని భావించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 11 పరీక్షా కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్టు సీఐడీ నిర్ధారణకు వచ్చింది. వీరిలో బెంగళూరు, కలబురగి కేంద్రాలే ఉన్నాయి. 

Updated Date - 2022-06-16T16:19:20+05:30 IST