Oct 19 2021 @ 01:03AM

క్రిస్మస్‌కు శ్యామ్‌సింగరాయ్‌

నాని కథానాయకుడిగా పాతతరం కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్‌’. సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చే స్తున్నట్టు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా నాని, సాయిపల్లవిపై పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నానీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీత దర్శకుడు. రాహుల్‌  రవీంద్రన్‌, మురళీశర్మ, అభినవ్‌ గోమటం కీలకపాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సానుజాన్‌ వర్గీస్‌.