Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 27 Jan 2022 12:41:52 IST

వరల్డ్ నెం.3 గా నేచురల్ స్టార్ సినిమా

twitter-iconwatsapp-iconfb-icon
వరల్డ్ నెం.3 గా నేచురల్ స్టార్ సినిమా

నేచురల్ స్టార్ నానీ, టాలెంటెడ్ స్టార్ సాయిపల్లవి జంటగా.. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. బెంగాలీ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. టాలీవుడ్ లో మంచి వసూళ్లు తెచ్చుకున్న ఈ సూపర్ హిట్ మూవీ.. నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అయింది. థియేటర్ప్ లో ఏ స్థాయిలో ఆదరణ దక్కించుకుందో ఓటీటీలోనూ అదే స్థాయిలో ఆదరణ లభించింది. అత్యధికంగా వ్యూయింగ్ అవర్స్ ను దక్కించుకుని,  మరో అరుదైన రికార్డు ను కూడా నమోదు చేసింది. ఇప్పటి వరకూ ఏ భారతీయ చిత్రానికి దక్కని అరుదైన రికార్డు ‘శ్యామ్ సింగరాయ్’ సొంతమైంది. 


స్ట్రిమింగ్ అయిన మొదటి మూడురోజుల్లోనే దాదాపు 3.6 వ్యూయింగ్ అవర్స్ ను దక్కించుకుంది ‘శ్యామ్ సింగరాయ్’. ఆ వారం లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన సినిమాలు, వెబ్ సిరీసుల్లో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ఇండియా మూవీగా నిలిచింది. ఇప్పటి వరకూ ఏ సౌత్ మూవీ కూడా ఈ స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ వారం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 3 లో ‘శ్యామ్ సింగారాయ్’ చిత్రం నిలవడం అరుదైన ఘనతగా చెప్పొచ్చు. థియేటర్స్ తో పాటు, ఓటీటీలోనూ ఒకే స్థాయిలో ఆదరణ దక్కించుకున్న చిత్రంగానూ శ్యామ్ సింగరాయ్ నిలిచింది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International