నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. `టక్ జగదీష్` చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన నాని.. ప్రస్తుతం `శ్యామ్ సింగరాయ్` సినిమా షూటింగ్‌కు హాజరవుతున్నాడు. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన `శ్యామ్ సింగరాయ్` ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు.
త్వరలో టీజర్ కూడా విడుదల కాబోతోందట. ఉగాది సందర్భంగా టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాని ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. `టక్ జగదీష్` చిత్రంలో మహిళలతో ఉన్న చిన్న సీన్‌ను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.