Abn logo
Mar 26 2020 @ 11:37AM

నా ద్వారా వైరస్ వ్యాపించకూడదని రాలేదు: ప్రముఖ సింగర్

తెలుగు, హిందీతోపాటు పలు ఇతర భాషల్లో పాటలు పాడిన ప్రముఖ గాయని శ్వేతా పండిట్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. కరోనా మహమ్మారి ప్రస్తుతం ఇటలీని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా శ్వేత వెల్లడించారు. 


‘‘భారతీయులు కరోనా వైరస్‌ను చాలా తేలికగా తీసుకుంటున్నారు. ప్రపంచం మొత్తం మీద కరోనా అత్యంత ప్రభావం చూపిస్తున్న ఇటలీలో ప్రస్తుతం నేనున్నాను. కొన్ని రోజులుగా స్వీయ నిర్భందంలో ఉండిపోయాను. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను ఇక్కడ ప్రతిరోజూ అంబులెన్స్ సైరన్‌తో నిద్ర లేస్తున్నాను. కరోనా గురించి ఇటలీ వాసులు తెలుసుకునే లోపే ఆ మహమ్మారి దేశమంతా వ్యాపించేసింది. హోలీ వేడుకల కోసం నేను భారత్‌కు రావాలనుకున్నాను. కానీ, నా ద్వారా వైరస్ భారత్‌లోకి ప్రవేశించడం ఇష్టం లేక ఇటలీలోనే ఒంటరిగా ఉండిపోయాను. దయచేసి ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండండి. శుభ్రత పాటించండి’’ అని శ్వేత సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement