షటిల్ పోటీలను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ బొండా జగన్
కూర్మన్నపాలెం, జనవరి 16: ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 87వ వార్డులో ఆదివారం షటిల్ పోటీలను నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ముఖ్య అతిఽథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందన్నారు. యువత అన్ని రంగాల్ల రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయరామరాజు, కళ్లేపల్లి శ్రీను, సత్తిబాబు పాల్గొన్నారు.