Abn logo
Mar 27 2020 @ 01:53AM

డ్రోన్లతో ‘షట్‌డౌన్‌’ పర్యవేక్షణ

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రజలెవరూ షట్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించకుండా ఓ కంట కనిపెట్టేందుకు పలుచోట్ల అధికారులు డ్రోన్లు ఉపయోగించారు. షట్‌డౌన్‌ రెండో రోజు గురువారం కట్టుతప్పిన పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇందులో పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. తన ఇంటి వద్ద దాదాపు 200 మందికి కూరగాయలు పంపిణీ చేసినందుకు ఆయనపై కేసు పెట్టారు. ఆయన ఇంటి వద్ద గుమిగూడిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 1,200 మందిపై కేసు లు పెట్టారు. దేశవ్యాప్తంగా ప్రజలను నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుక్కునేందుకు అనుమతించారు. నిత్యావసర సరుకుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారన్న వార్తలతో అధికారులు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆ వాహనాలను పంపించేలా పోలీసులను ఆదేశించారు. 

Advertisement
Advertisement
Advertisement