లక్ష్మీరతన్‌ శుక్లా భార్యకు కరోనా

ABN , First Publish Date - 2020-07-12T09:07:12+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్‌ లక్ష్మీరతన్‌ శుక్లా భార్య స్మితా సన్యాల్‌ శుక్లాకు కరోనా సోకింది. తన భార్యకు పాజిటివ్...

లక్ష్మీరతన్‌ శుక్లా భార్యకు కరోనా

కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్‌ లక్ష్మీరతన్‌ శుక్లా భార్య స్మితా సన్యాల్‌ శుక్లాకు కరోనా సోకింది. తన భార్యకు పాజిటివ్‌ అని తేలిందని పశ్చిమ బెంగాల్‌ క్రీడా మంత్రి కూడా అయిన శుక్లా తెలిపాడు. తనతో పాటు కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు పేర్కొన్నాడు. శుక్లా భార్య స్మిత.. ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Updated Date - 2020-07-12T09:07:12+05:30 IST