Abn logo
Feb 27 2021 @ 22:33PM

బాయ్‌ఫ్రెండ్‌తో తండ్రిని క‌లిసిన శ్రుతి హాస‌న్‌

చెన్నై సుంద‌రి శ్రుతిహాస‌న్ రీసెంట్‌గా త‌న తండ్రి క‌మ‌ల్‌హాస‌న్‌ను క‌లిసింది. ఆ మ‌ధ్య క‌మ‌ల్ హాస‌న్ మోకాలికి ఆప‌రేష‌న్ జ‌రిగింది. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన క‌మ‌ల్‌హాస‌న్ త‌న రాజ‌కీయ పార్టీ, ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజి బిజీగా ఉన్నారు. కాబ‌ట్టి తండ్రిని శ్రుతిహాస‌న్ డిస్ట్ర‌బ్ చేయ‌లేదు. అయితే రీసెంట్‌గా త‌న తండ్రిని క‌లిసి మాట్లాడింది. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే క‌మ‌ల్‌హాస‌న్‌ను త‌న బాయ్‌ఫ్రెండ్ శంత‌ను హాజ‌రిక‌తో పాటు వెళ్లి క‌లిసింది. చాలా కాలం త‌ర్వాత తండ్రిని క‌లిశాన‌ని శ్రుతిహాస‌న్ చెప్పింది. అనంత‌రం త‌న తండ్రికి క‌లిసి ఉన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో శ్రుతి బాయ్‌ఫ్రెండ్ ఎక్క‌డా క‌న‌ప‌డ‌టం లేదు. 

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న శ్రుతిహాస‌న్‌.. మళ్లీ సినిమాలు, మ్యూజిక్ క‌న్‌స‌ర్ట్స్‌పై ఫోక‌స్ పెట్టింది. రీసెంట్‌గా క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న శ్రుతిహాస‌న్‌, ఇప్పుడు ఏకంగా ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స‌లార్ సినిమాలో న‌టిస్తుంది. మ‌రోవైపు త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టించిన లాభం సినిమా విడుద‌ల‌వుతుంది. 

Advertisement
Advertisement
Advertisement