ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన శృతిహాసన్.. కొంతకాలంగా ఎటువంటి హడావుడి చేయకుండా కామ్‌గా ఉంటుంది. ఆమెపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా.. మళ్లీ ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అవుతోంది. రవితేజ, గోపీచంద్ మలినేని చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న శృతిహాసన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటో ఆమె మాటల్లోనే..
‘‘నేనొక సాదారణమైన అమ్మాయిని. చిన్నప్పటి నుంచి కూడా ఎవరూ శృతి నీవు అలా చేశావ్.. ఇలా చేశావ్ అని అనలేదు. అదృష్టవశాత్తూ నాకు మంచి పేరుంది. చిన్నప్పుడు సినిమా సెట్స్‌కు వెళ్లడం చాలా ఉత్తేజంగా అనిపించేది. డాడీ సినిమాలు చాలా వరకు నేను సెట్స్‌లో ఉండే చూశాను. ఇంకా చెప్పాలంటే నేను సినిమా సెట్స్ మధ్యే పెరిగాను. అలాగే చెన్నైలోని ఓ గొప్ప స్కూల్లో చదివాను. టీచర్లు నన్ను చాలా ఎంకరేజ్ చేసేశారు. అది ఇథియోపియన్ స్కూల్. చాలా సౌకర్యంగా ఉండేది. పిల్లలు ఎదిగేందుకు, విజ్ఞానాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకునేవాళ్లు. ఆ స్కూల్‌కి నా ధన్యవాదాలు. ఇప్పటికీ ఆ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. కాలేజ్‌కి వచ్చేసరికి నేను ఇంజనీరింగ్ చదివాను. సైకాలజీ చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లాను. అక్కడి నుంచి వచ్చాక నటిగా కెరీర్ స్టార్ట్ చేశాను. నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా అంటే చాలా ఇష్టం. రైటర్, డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను. యాక్టింగ్ నా డెస్టినీ అనుకుంటున్నాను. యాక్టింగే నన్ను గుర్తించింది. నాకు నచ్చిన సినిమా, ఎక్కువగా చూసిన సినిమా జురాసిక్ పార్క్. ఆ స్టోరీ నాకు చాలా నచ్చింది... అంటూ పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న శృతిహాసన్ తెలుగులో తనకు నచ్చిన సినిమా గురించి చెప్పమంటే.. ‘ఒక్కటి చెప్పడం అంటే కష్టం.. గబ్బర్‌సింగ్ ఎప్పటికీ స్పెషల్. రేసుగుర్రం, బలుపు, శ్రీమంతుడు ఇలా దేనికదే స్పెషల్..’’ అని అన్నారు.
హీరోల గురించి..
మహేష్ బాబు: హ్యాండ్సమ్
అల్లు అర్జున్: పట్టుదల
పవన్ కళ్యాన్: స్టైలిష్
ప్రభాస్: టాల్
శృతిహాసన్: నా గురించి నేను చెప్పలేను. ఇంకెవరినైనా అడగండి అని తెలిపింది.
మీ జీవితానికి ఆదర్శం ఏమిటి? అని అడిగితే.. ‘చాలా మందిని కలుస్తుంటాను. నా తల్లిదండ్రులు సహా అందరిలో ఉన్నతమైన ఆలోచనలు, ఆచరణలు వెతుకుతాను. ఉదాహరణకు సహనం, దయ వంటివి.. నేను ఎవరినీ అనుసరిస్తానో వాళ్లే ఆరోజు నాకు రోల్ మోడల్స్. నేను ప్రజల నుంచి చాలా నేర్చుకుంటాను..’ అని అన్నారు.
ర్యాపిడ్ ఫైర్ టైమ్:
1. మీరు దేనికోసం ఎప్పుడూ పోరాడటానికి సిద్ధంగా ఉంటారు?
శృతి: ప్రేమ కోసం
2. మీరు పగటి కలలు కంటారా?
శృతి: నేను ప్రాక్టికల్ డే డ్రీమర్ని
3. మీకు ఇష్టమైన వంటకం ఏది?
శృతి: సౌత్ ఇండియన్ వంటకాలు
4. మీ ఇంట్లో మీకు ఇష్టమైన ప్రదేశం ఏది?
శృతి: మా ఇంట్లో నాకు కిచెన్ ఇష్టమైన ప్రదేశం. వాస్తవానికి బాత్రూమ్ అంటే ఇష్టం. నాకు చాలా ఆలోచనలు అక్కడే వస్తాయి.
5. కిచెన్ అంటే ఇష్టమన్నారు కదా? మీకు ఏ వంటకం అంటే ఇష్టం? ఎక్కువగా ఏం వండుతారు?
శృతి: సౌత్ ఇండియన్ వంటకాలు
6. మీరు ఇంట్లో నుంచి ఇది తీసుకోకుండా బయటికి వెళ్లరు?
శృతి: మా ఇంటి తాళాలు
7. కలలో ఎవరినైనా హగ్ చేసుకోవాల్సి వస్తే.. ఎవరిని హగ్ చేసుకుంటారు?
శృతి: మా తాతయ్య
8. మీకు ఇష్టమైన బంధువు ఎవరు?
శృతి: మా నాన్న, అమ్మ, కజిన్స్
9. మీకు బాధ కలిగించే అంశం ఏది?
శృతి: పిల్లల పట్ల క్రూరత్వం
10. మీకు సంతోషం కలిగించే అంశాలు ఏవి?
శృతి: బెటర్ పర్సన్‌గా జీవించడం
11. మీకు కోసం కలిగించే అంశం?
శృతి: సోమరితనంగా ఉండే వ్యక్తులు, అబద్ధం చెప్పేవాళ్లను చూస్తే కోపం
12. మీ బాల్యం నుంచి మీరు నేర్చుకున్న ఒక అంశం?
శృతి: బలం
13. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
శృతి: నేను అనుకున్నది సాధిస్తానని టీచర్ అనడం గొప్ప కాంప్లిమెంట్
14. మీలో మీరు ఏ మార్పును కోరుకుంటారు?
శృతి: నేను సహనాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను
15. మీ అమ్మగారికి ఏం సలహా ఇస్తారు?
శృతి: ఆమెకు సలహా ఇవ్వలేను.
16. మీ చైల్డ్హుల్ క్రష్?
శృతి: లియోనార్డో డికాప్రియో
17. మీ దృష్టిలో ప్రేమంటే?
శృతి: వేర్వేరు వ్యక్తులతో విభిన్నమైన నిర్వచనాలు. నా విషయంలో మాత్రం ప్రేమంటే నడిపించే శక్తి.
ఇంకా పాములంటే భయమని, హిస్టరీ సబ్జెక్ట్ అంటే ఇష్టమని, మ్యాథ్స్ అంటే ఇష్టం లేదని శృతి చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో మీ గురించి తప్పుడు ప్రచారం జరిగినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే.. ‘వాటిని పట్టించుకోను’ అన్నారు. అభిమానులు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లకి తానే రియాక్ట్ అవుతానని, తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని తానే రన్ చేస్తానని ఆమె తెలిపారు. ఇంకా మరెన్నో విశేషాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. వాటిని పై వీడియోలో చూడవచ్చు.