Abn logo
Nov 29 2020 @ 00:59AM

బాలీవుడ్‌ చిత్రంలో శ్రుతి

దక్షిణాది కథానాయిక శ్రుతీహాసన్‌ తెలుగులో పవన్‌కల్యాణ్‌ సరసన ‘వకీల్‌సాబ్‌’ చిత్రంలో  నటిస్తోన్న విషయం తెలిసిందే.  దీంతోపాటు ఒక బాలీవుడ్‌ చిత్రాన్ని అంగీకరించినట్టు తెలిపారు. ‘‘ఇది ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని’’ శ్రుతి తెలిపారు. అభిమానులతో నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌సెషన్‌లో పాల్గొన్న శృతీ తన సినిమాల గురించి అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘వకీల్‌సాబ్‌’ చిత్రం షూటింగ్‌లో జనవరి నుంచి పాల్గోనున్నట్టు శ్రుతి తెలిపారు. ఈ చిత్రంతో మూడోసారి పవన్‌ కల్యాణ్‌తో నటించబోతున్నట్టు చెప్పారు. అయితే తన పాత్ర గురించిన వివరాలను వెల్లడించలేదు. 

Advertisement
Advertisement
Advertisement