Abn logo
Nov 25 2020 @ 13:33PM

`వకీల్ సాబ్` సెట్స్‌కు వస్తున్నా: శ్రుతి

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ `కాటమరాయుడు` తర్వాత హీరోయిన్ శ్రుతీ హాసన్ వెండితెరకు దూరమైంది. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆమె ఏ భాషలోనూ, ఏ సినిమాలోనూ కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత శ్రుతి మళ్లీ తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. 


గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న `క్రాక్‌` సినిమాలో శ్రుతి హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రీ-ఎంట్రీ సినిమా `వకీల్‌ సాబ్‌`లోనూ కీలక పాత్ర చేయబోతోంది. అయితే ఇప్పటివరకు షూటింగ్‌కు హాజరు కాలేదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చిన శ్రుతి.. `వకీల్ సాబ్` గురించి మాట్లాడింది. `పవన్ మళ్లీ సినిమాలు చేస్తుండడం సంతోషంగా ఉంది. ఆయన రీ-ఎంట్రీ సినిమాలో నేను భాగమైనందుకు మరింత ఆనందంగా ఉంది. జనవరి నుంచి `వకీల్ సాబ్` షూటింగ్‌కు హాజరవుతా. పవన్‌తో మూడోసారి పనిచేస్తున్నా. పవన్, సూర్య, రవితేజ వంటి హీరోలతో మాత్రమే నేను ఎక్కువ సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నాన`ని శ్రుతి పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement