శ్రీమండెం రాయుడికి మోక్షమెప్పుడో

ABN , First Publish Date - 2022-08-09T04:29:56+05:30 IST

ఆరో శతాబంలో నిర్మించిన శ్రీ మండెం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం శిధిలంగా మారింది. వందలాది ఎకరాల మాన్యం భూము లున్నా ఆలయం అభివృద్ధి శూన్యమనే చెప్పవచ్చు.

శ్రీమండెం రాయుడికి మోక్షమెప్పుడో
ప్రధాన ఆలయం పైభాగాన ఉన్న పిచ్చిమొక్కలు

వందలాది ఎకరాల మాన్యాలున్నా అభివృద్ధి శూన్యం

నాడు స్వర్ణయుగంగా.. నేడు శిథిలంగా 

గుప్త నిధుల కోసం తవ్వకాలు

చిన్నమండెం, ఆగస్టు8: ఆరో శతాబంలో నిర్మించిన శ్రీ మండెం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం శిధిలంగా మారింది. వందలాది ఎకరాల మాన్యం భూము లున్నా ఆలయం అభివృద్ధి శూన్యమనే చెప్పవచ్చు. నాడు స్వర్ణయుగంగా వెలుగొందిన ఆయలం నేడు శిధిలమై గుప్తనిధుల తవ్వకాలకు నిల యమైం దనే ఆరోపణలున్నాయి. కొండల్లో, గుట ్టల్లో ఉగ్రరూపంలో ఉన్న నరసింహ స్వామి యుగం సమాప్తమని, వైశా ఖ శుద్ధపౌర్ణమి నాడు వెంగమాంబ చిలు కుతున్న పెరుగు నుంచి ఉద్భవించిన స్వామివారు మాండ వ్య మహర్షి తపస్సును మెచ్చి దర్శన భాగ్యం కల్పిస్తూ (చిన్న మండెం రాయుడు, పెద్దమండెం రాయుడు) రాజులకు ఇక్కడ ఆలయం నిర్మించాలని స్వామివారే చెప్పడంతో శ్రీమండెం లక్ష్మినరసింహస్వామి ఆలయం నిర్మించగా ఆలయానికి మాండవ్య మహర్షి ప్రతి ష్ఠించారు. ఈ ఆలయాన్ని సందర్శించిన అన్నమయ్య స్వా మి వారి గురించి 15 సంకీర్త నలు చేశారు. ఇక్కడి స్వామి వారి మూలవిరాట్టు అచ్చు కంచు గంట మోగేశబ్దం వలే మోగడం విశేషం. వందలాది ఎకరాలు మాన్యాలు ఉన్న శ్రీనివాసపురం రిజర్వాయర్‌ కింద స్వామి వారి భూములు పోయినప్పుడు రూ. 42 లక్షలు స్వామి పేరుతో డిపాజిట్‌ చేసిఉన్నా అభివృద్ధికి ఆమడ దూ రంగానే ఉంది.

గాలిగోపురంలో ఎంతో విలువైన విగ్రహాలు కూలిపోతున్న, వర్షం వస్తే చాలు ఆలయం మొత్తం తడిసి పోతుంది. స్వామి వారి పట్టువస్త్రాలు సైతం నానిపోతుండ డంతో, ప్రధాన ఆలయం పైభాగాన పిచ్చి మొక్కలు, చెట్లు అడవిని తలపించే విధంగా దర్శనమిస్తూ ఉండడంతో అధికారుల తీరుతో భక్తులు ఆగ్రహిస్తున్నారు. ప్రజాప్రతిని ధులు, అధికారుల దృష్టి సారించి ఈ ఆలయానికి పూర్వ వైభవం తేవాలని భక్తులు కోరుకుంటున్నారు. 

గుప్త నిధుల కోసం తవ్వకాలు

పురాతన ఆలయం కావడంతో గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వకాలను చేస్తుంటారు. నిధుల కోసం తవ్విన తవ్వకాల్లో కల్యాణ మండపం, ప్రహరీ, వంటశాల, ప్రధాన ఆలయాల్లో సైతం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తవ్వకాలు జరపడంతో ఇది పూర్తిగా కూలే విధంగా దర్శన మిస్తోంది. స్వామి వారి మూలవిరాట్టు ముక్క పోవడంతో ఆ విగ్రహాల ను పక్కన పెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈఓ కొండారెడ్డి వివరణ

ఈ ఆలయం కోసం మూడు కోట్ల 80 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం కోటి 25 లక్షలు మం జూరు చేసింది. ఇందులో 20 లక్షలు ప్రభుత్వానికి డిపాజిట్‌ చేస్తే మంజూరైన నిధులు విడుదల అవుతాయి. స్వామి వారి పేరు మీద ఉండే డిపాజిట్లను వాడకుండా ఈ 20 లక్షలను విరాళాలు, దాతలు ముందుకు వచ్చి ఆలయం తర పున అకౌంట్‌ చేయించామని, దాతలు విరాళాలు అందించా లని తెలిపారు.

Updated Date - 2022-08-09T04:29:56+05:30 IST