షాద్‌నగర్‌లో శ్రీమద్భగవద్గీత రథయాత్ర

ABN , First Publish Date - 2021-12-07T05:28:34+05:30 IST

షాద్‌నగర్‌లో శ్రీమద్భగవద్గీత రథయాత్ర

షాద్‌నగర్‌లో శ్రీమద్భగవద్గీత రథయాత్ర
రథయాత్రలో పాల్గొన్న నాయకులు

షాద్‌నగర్‌అర్బన్‌: హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ షాద్‌నగర్‌ పట్టణంలో సోమవారం శ్రీమద్భగవద్గీత రథయాత్రను నిర్వహించారు. స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి వెంకటేశ్వర దేవాలయం వరకు రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో విశ్వహిందూపరిషత్‌, భజ్‌రంగ్‌దళ్‌, బీజేపీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్‌ మాట్లాడుతూ 15 నుంచి 40 సంవత్సరాల వయస్సు కల్గిన యువతీ, యువకులు 40 భగవద్గీత శ్లోకాలు నేర్చుకుని పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు మఠం రాచయ్య, హన్మంత్‌రెడ్డి, గూడెం రమేష్‌, బాలబ్రహ్మచారి, వంశీ, బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్దన్‌రెడ్డి, ఏపీ మిఽథున్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, మఠం రుషీకేష్‌, చెట్ల వెంకటేష్‌, వంశీకృష్ణ, క్యామ మహేష్‌ పాల్గొన్నారు. 

కన్నుల పండువగా శ్రీనివాసుడి కల్యాణం

షాబాద్‌: మండలంలోని దైవాలగూడలో శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశ్రీనివాసుడి కల్యాణం సోమవారం కన్నుల పండువగా జరిగింది. కల్యాణాన్ని తిలకించడానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుమ్మరి చెన్నయ్య, ఆయాగ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. 

చిన్నారులకు అక్షరాభ్యాసం 

యాచారం: మూలనక్షత్రం సందర్భంగా మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో శ్రీజ్ఞానసరస్వతీమాత ఆలయం ఆవరణలో సోమవారం 50మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. వివిధ గ్రామాలకు చెందిన భక్తులు హోమం నిర్వహించారు.  

శబరిమలకు వెళ్లిన అజీజ్‌నగర్‌ స్వాములు

మొయునాబాద్‌ రూరల్‌: అజీజ్‌నగర్‌లోకు గ్రామానికి చెందిన అయ్యప్పభక్తులు సోమవారం సత్యనారాయణ గుప్తాగురుస్వామి, వనం మాదవరెడ్డి గురుస్వాముల అధ్వర్యంలో జరిగిన పూజ కార్యక్రమంలో ఇరుముడి కట్టుకొని స్వాములు శబరికి వెళ్లారు.  దుర్తాప్రసాద్‌, నరేందర్‌గౌడ్‌, చంద్రపాల్‌రెడ్డి, తూర్పు శ్రీనివా్‌సరెడ్డి, మహిపాల్‌ రెడ్డి,ప్రసాద్‌ రెడ్డిలు ఉన్నారు.  

Updated Date - 2021-12-07T05:28:34+05:30 IST