అలరించిన శ్రీకృష్ణతులాభారం

ABN , First Publish Date - 2022-09-27T05:14:51+05:30 IST

వితరాలకు బంగారు బహుమానాలుగా సురభి నాటకాలు నిలుస్తాయని జిల్లా కలెక్టరు విజయరామరాజు పేర్కొన్నారు.

అలరించిన శ్రీకృష్ణతులాభారం
శ్రీకృష్ణతులాభారం నాటకంలో ఓ సన్నివేశం

కడప (కల్చరల్‌), సెప్టెంబరు 26: భావితరాలకు బంగారు బహుమానాలుగా సురభి నాటకాలు నిలుస్తాయని జిల్లా కలెక్టరు విజయరామరాజు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కడప కళాక్షేత్రంలో మూడవ రోజు శ్రీకృష్ణ తులాభారం నాటకం కళాభిమానులను అలరించింది. సోమవారం నాటక ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టరు హాజరై ప్రదర్శన ప్రారంభించి మాట్లాడారు. సుర భి నాటక కళాకారుల నిరంతర కృషి, పౌరాణిక సంస్కృతిపై వారికున్న మక్కువ, పాత్రలలో జీవించడం వంటి లక్షణాలు తెలుగునాటక రంగ వైభవాన్ని దశ దిశలా ఖ్యాతిగాంచాయన్నారు. అనంతరం శ్రీకృష్ణతులాభారం నాటక ప్రదర్శన జరిగింది. వినాయక నాట్యమండలి కళాకారుల బృందం ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు తన్మయత్వం పొందారు. కాగా నాటకాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర నాటకాన్ని ప్రదర్శించనున్నారు. 

Updated Date - 2022-09-27T05:14:51+05:30 IST