ఉత్సాహంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

ABN , First Publish Date - 2022-08-20T06:11:36+05:30 IST

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. గోకుల కృష్ణుడికి భక్తకోటి నీరాజనాలు సమర్పించింది.

ఉత్సాహంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
ప్రత్యేక అలంకరణలో రాధాకృష్ణులు

కరుణించు.. కన్నయ్యా!

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

       శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. గోకుల కృష్ణుడికి భక్తకోటి నీరాజనాలు సమర్పించింది. కృష్ణమందిరాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. ఇస్కాన్‌ మందిరంలో విశ్వశాంతి హోమం, రాధాపార్థసారథులకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులో తెప్పోత్సవం నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఉట్టి కొట్టే వేడుకలో యువత ఉత్సాహంగా పాల్గొంది. శ్రీకృష్ణ, రాధ, గోపికల వేషధారణలో ఆలయాలకు వచ్చిన చిన్నారులు ముచ్చటగొలిపారు.

- అనంతపురం కల్చరల్‌



Updated Date - 2022-08-20T06:11:36+05:30 IST