వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T06:08:51+05:30 IST

శ్రీకృష్ణుని జన్మదిన వేడుకను శుక్రవారం ఉమ్మడి జిల్లాల వాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
కర్నూలులో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న టీజీ వెంకటేష్‌

కర్నూలు(కల్చరల్‌), ఆగస్టు 19: శ్రీకృష్ణుని జన్మదిన వేడుకను శుక్రవారం ఉమ్మడి జిల్లాల వాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వైష్టవ దేవాల యాలు, సాయిబాబా ఆలయాలు, గోశాలలు, ఇస్కాన్‌ ధార్మిక కేంద్రాలలో కృష్ణ జయంతి పూజలు నిర్వహించారు. భరతమాత మాతృమండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను వైభవంగా నిర్వహించారు. నగరంలోని వెంకట రమణ కాలనీలోగల లక్ష్మి వేంకటేశ్వర దేవాలయ కల్యాణ మండపంలో కృష్ణాష్ట మిని సందర్భంగా ఏర్పాటు చేసిన వేషధారణ పోటీల ఆకట్టుకున్నాయి. నగరం లోని కిడ్స్‌ వరల్డ్‌ ఎదురుగా ఉన్న ఇస్కాన్‌ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సం ఘం) ధ్యాన కేంద్రంలో రెండు రోజులపాటు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్ణమి వేడుకలను శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. టీజీ వెంకటేశ్‌ రాజ్యలక్ష్మి దంపతులు ఇస్కాన్‌ ధ్యాన మందిరంలో పూజలు నిర్వహించారు. నగరంలో కిడ్స్‌ వరల్డ్‌ సమీపంలోని జిల్లా గోరక్షణ ప్రాంగణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని అవధూత రామిరె డ్డి తాత సంస్థాన్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, అవధూత రామిరెడ్డి తాత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మహోన్నతమైనవని, వీటిని భావి తరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని వెంకటరమణ కాలనీలోగల లక్ష్మివేంకటేశ్వర స్వామి కల్యాణ మంటపంలో భరతమాత మాతృమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో టీజీ వెంకటేశ్‌, రాజ్యలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.  చిన్నారులతో   కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమలో పాల్గొన్నారు. వేషధారణ పోటీలు, నృత్య పోటీల్లో విజేతలకు  బహుమతులు అందించారు. నగరంలోని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎల్‌ వెంకయ్యనగర్‌లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని కొలువుదీర్చి గురుపూజతో వేడుకలను ప్రారంభిం చారు. ఈ వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు డీఎస్పీ కేవీ మహేశ్‌ పాల్గొని పూజలు నిర్వహించారు.  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడు కలను బి.క్యాంపులోని విజ్ఞాన మం దిరంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు.

కోడుమూరు(రూరల్‌): మండలంలోని వర్కూరులో శ్రీకృష్ణాష్టమి వేడు కలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణాలయంలో  పంచామృతా భిషేకం, పుష్పార్చన పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో వెంకటరాముడు, నారాయణ, కృష్ణమూర్తి, నారాయణరెడ్డి, మల్దకల్లు,రామచంద్రుడు పాల్గొన్నారు. 

గూడూరు: పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  తూర్పు బీసీ కాలనీల్లో శ్రీకృష్ణుని ఆలయంలో స్వామి వారికి పూజలు చేశారు. శనివారం మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు బాలికలకు కిప్పింగ్‌ (తాడాట) పోటీలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఉట్టి కొట్టే కార్యక్ర మంతో పాటు శ్రీకృష్ణుని ఉత్సవ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు.

ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, నన్నూరు, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, హుశేనాపురం, కాల్వబుగ్గ, శకునాల తదితర గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణున్ని రథంపై ప్రతిష్టించి   వీధుల్లో ఊరేగించారు. 


Updated Date - 2022-08-20T06:08:51+05:30 IST