ఆసిఫాబాద్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T03:48:36+05:30 IST

జిల్లా కేంద్రంలో యాదవసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు ఇంటినుంచి యాదవ సంఘం భవనం వరకు శోభాయాత్ర నిర్వహించారు.

ఆసిఫాబాద్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
రెబ్బెనలో ఆకట్టుకున్న చిన్నారుల వేషాధారణ

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 19: జిల్లా కేంద్రంలో యాదవసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు ఇంటినుంచి యాదవ సంఘం భవనం వరకు శోభాయాత్ర నిర్వహించారు. డోలు, మద్దెల చప్పులు, కళాకారుల నృత్యాలతో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, ఎమ్మెల్యే ఆత్రంసక్కు, యాదవసంఘం జిల్లా అధ్య క్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఉట్టికొట్టె కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ రాజేశం, ఎంపీపీ మల్లికార్జున్‌యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

 మండలాల్లో.. 

బెజ్జూరు/చింతలమానేపల్లి /కౌటాల/ సిర్పూర్‌ (టి)/తిర్యాణి/జైనూరు/వాంకిడి/రెబ్బెన/ కాగజ్‌ నగర్‌: బెజ్జూరు మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వ హించారు. చింతలమానేపల్లి మండలకేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీపీ నానయ్య, నాయకులు వెంకన్న ముఖ్యఅతిథిగాపాల్గొని శ్రీకృష్ణుడి చిత్రపటా నికి పూజలు నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. కౌటాల మండలకేంద్రంలోని నదిమా బాద్‌లో ఎంపీపీ విశ్వనాథ్‌, ఉమ్మడి డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య ఉట్టికొట్టే కార్యక్రమం ప్రారంభిం చారు. గ్రామాల్లో చిన్నారులు, యువకులు ఉట్టికొ ట్టారు. చిన్నారులను రాధాకృష్ణులుగా తయారు చేశారు. సిర్పూర్‌(టి) మండలకేంద్రంలో ఎస్సై రవి కుమార్‌ పతాకావిష్కరణ చేశారు. తిర్యాణిలో ఆల యాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పెర్కపల్లి గ్రామంలో ఉట్టికొట్టే కార్యక్రమం ఆకట్టుకుంది. జైనూర్‌ మండలంలోని గ్రామాల్లో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. వాంకిడిలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో కనువిందు చేశారు. వేడుకల్లో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.  రెబ్బెన మండలంలోని భగత్‌సింగ్‌నగర్‌ అంగన్వాడీ కేంద్రం లో కృష్ణుడి గోపిక వేషాధారణ ఎంతగానో ఆకట్టుకుంది.కాగజ్‌నగర్‌లో శుక్రవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. యాదవసంఘం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిసేవ చేపట్టారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

Updated Date - 2022-08-20T03:48:36+05:30 IST