4,155 శ్రామిక్ రైళ్లలో 57 లక్షల మందిని తరలించిన రైల్వే

ABN , First Publish Date - 2020-06-03T03:41:36+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సొంత రాష్ట్రాలకు తరలించేందుకు గత 33

4,155 శ్రామిక్ రైళ్లలో 57 లక్షల మందిని తరలించిన రైల్వే

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సొంత రాష్ట్రాలకు తరలించేందుకు గత 33 రోజుల్లో 4,155 ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడిపినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రైళ్ల ద్వారా 57 లక్షల మందిని వారిని సొంత రాష్ట్రాలకు తరలించినట్టు తెలిపింది. అత్యధికంగా గుజరాత్ నుంచి 1,027 రైళ్లు, మహారాష్ట్ర నుంచి 802, పంజాబ్ నుంచి 416, ఉత్తరప్రదేశ్ నుంచి 288, బీహార్ నుంచి 294 రైళ్లు నడవగా, ఉత్తరప్రదేశ్‌కు 1,670 రైళ్లు, బీహార్‌కు 1,482, జార్ఖండ్‌కు 194, ఒడిశాకు 180 రైళ్లు, పశ్చిమ బెంగాల్‌కు 135 రైళ్లు చేరుకున్నాయి.

Updated Date - 2020-06-03T03:41:36+05:30 IST