Abn logo
Apr 3 2020 @ 09:20AM

క్వారంటైన్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌..!

కోలీవుడ్‌లో రాణిస్తున్న కన్నడభామ శ్రద్ధా శ్రీనాథ్‌ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్న విషయం తాజాగా వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన శ్రద్ధా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తుండడంతో అధికంగా విమాన ప్రయాణాలు చేసేది. దీంతో కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ ఆదేశించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను శ్రద్ధా ఖండించింది.


మార్చి 12 -15 తేదీల మధ్య కాలంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై విమాన ప్రయాణం చేశానని, ఆ విమానంలో ఎవరికీ కరోనా సోకలేదని, అయినా తన ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు తనకు తానుగా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నానని ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసింది.  మార్చి 29 నాటికి క్వారంటైన్‌ 14 రోజులు పూర్తయిందని, ప్రస్తుతం కిచెన్‌లో అమ్మకి సాయం చేస్తున్నానని కూడా శ్రద్ధా ట్వీట్‌ చేసింది.

Advertisement
Advertisement
Advertisement