Jul 4 2021 @ 14:20PM

శ్రద్ధా ఆచరిస్తోంది!

సలహా, సూచనలు ఇవ్వడం చాలా ఈజీ. వాటిని ఆచరించడమే కాస్త కష్టం. అవగాహన పేరుతో సినిమా హీరోయిన్లు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ వారిలో కొందరే వాటిని ఆచరిస్తారు. అలా ఆచరించి చూపే కొద్దిమంది హీరోయిన్‌లలో శ్రధ్ధా శ్రీనాథ్‌ ఒకరు. ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె చెప్పిన పనిని చేసి చూపిస్తారు. కొద్ది రోజులులగా ఆమె ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వినియోగం బ్యాగ్‌లను ఉపయోగించవద్దని క్యాంపెయిన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! అందులో భాగంగా ఆమె పాలిథిన్‌ వినియోగాన్ని పూర్తిగా మానేసి  జూట్‌, క్లాత్‌ బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తను క్లాత్‌ బ్యాగ్‌లతో షాపింగ్‌ చేసిన ఫొటోలను ఓ పోస్ట్‌ చేశారు. ‘‘కనీసం ఈ ఏడాది నుంచి అయినా ప్లాస్టిక్‌ ఫ్రీ బ్యాగ్‌లను ఉపయోగించండి. ప్రకృతిని రక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ప్రకృతి ఆగ్రహిస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు’’ అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం శ్రద్ధాశ్రీనాథ్‌ ‘రుద్ర ప్రయాగ్‌’, ‘కలియుగం’, ‘ఆరట్టు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. 



Otherwoodsమరిన్ని...