త్వరలో పెళ్లి చేసుకొబోతున్న Shraddha Kapoor

బాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరితర్వాత మరొకరు దాంపత్య జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. ఈ మధ్యనే రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, అనుష్క రంజన్-ఆదిత్య సీల్ పెళ్లి చేసుకున్నారు. విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ డిసెంబర్ 9న వివాహమాడనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరొకరు చేరబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒకరు కొత్తగా పెళ్లి పీటలను ఎక్కబోతున్నారని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెవరో కాదు..  భాఘి, ఏక్ విలన్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాల్లో నటించి కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి శ్రద్దా కపూర్.

శక్తి కపూర్ తనయగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా ఆషికీ-2 సినిమాతో ఫేమ్‌ను సంపాదించుకున్న నటి శ్రద్దా కపూర్. గత కొంత కాలంగా రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్ చేస్తోంది. అనేక ఈవెంట్లల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. తాజాగా శ్రద్దా కపూర్ వివాహాంపై అలనాటి నటి, ఆమె మేనత్త పద్మిని కొల్హాపురి హింట్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

పద్మిని కొల్హాపురి గతంలో తను పాడిన పాటను రీక్రియేట్ చేసింది. శ్రద్దా కపూర్ ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంది. అందుకు ఆమె మేనత్త పద్మిని కామెంట్ చేసింది. ‘‘ నీ పెళ్లిలో కూడా ఈ పాటనే పాడుతాను ’’ అని ఆమె చెప్పింది. దీంతో శ్రద్దా కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకొబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. 

Advertisement

Bollywoodమరిన్ని...