‘సాహో’ తార శ్రద్ధాకపూర్ ఒక వింత బ్యూటీ సీక్రెట్ గురించి చెప్పింది. తన ముఖంపై ఎర్రగా కందిపోయినట్టు చిన్నచిన్న మొటిమలు వస్తుంటాయని, అప్పుడు తాను టూత్‌పేస్టును అక్కడ రాస్తానని తెలిపింది. ఇలా తాను చాలా ఏళ్లుగా చేస్తున్నానని, బాగానే పనిచేస్తోందని చెప్పింది. ఇది వరకు ఇలాంటి గృహచిట్కాలను చాలానే పాటించానని చెప్పుకొచ్చింది.
నిజంగా టూత్‌పేస్టు మొటిమలను కంట్రోల్ చేస్తుందా? లేదా? వైద్యపరంగా నిర్ధారణ కాలేదు. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే కొన్ని రకాల టూత్‌పేస్టులలో సిలికా ఉంటుంది. ఇది తేమని బయటికి పోయేలా చేస్తుంది. కనుక టూత్‌పేస్టు పెట్టగానే అందులోని సిలికా మొటిమల్లోని తేమని బయటికి పంపేసి, త్వరగా ఎండేలా చేస్తుంది. ఎండిన మొటిమ రాలిపోయి అక్కడ సాధారణ చర్మం వస్తుంది. ఇలాంటి చిట్కాలను పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమమన్నది సౌందర్య నిపుణుల అభిప్రాయం.