Abn logo
Oct 28 2020 @ 11:07AM

`నాగిని` పాత్రలో శ్రద్ధ!

Kaakateeya

`స్త్రీ`, `చిచ్చోరే` వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్ త్వరలో మరో ఆసక్తికర పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ `నాగిని` పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ తరహా పాత్రల్లో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు వైజయంతీ మాల, రీనా రాయ్, రేఖ, శ్రీదేవి కనిపించారు. 


ఈ జెనరేషన్‌లో శ్రద్ధకు ఆ అవకాశం దక్కింది. మరాఠీ సినిమా `లాపాచప్పి`తో ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు విశాల్ ఈ సినిమాను రూపొందించనున్నాడు. నాగిని పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని, ఆ పాత్ర తన కెరీర్లోనే మర్చిపోలేని పాత్రగా మిగిలిపోతుందని శ్రద్ధ ఆశాభావం వ్యక్తం చేసింది.  

Advertisement
Advertisement