Abn logo
Sep 16 2020 @ 17:24PM

మొక్కలు నాటిన `సాహో` బ్యూటీ!

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. దీనిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా భారీగా పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు. తాజాగా `సాహో` బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది. 


`బాహుబలి` ప్రభాస్ నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన శ్రద్ధా కపూర్ ఈ రోజు (బుధవారం) ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది. సమాజానికి ఎంతో మేలు చేసే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళుతున్న రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. 

Advertisement
Advertisement
Advertisement