ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

ABN , First Publish Date - 2022-01-20T06:21:55+05:30 IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వుంటున్నారంటూ స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ షోకాజు నోటీసు జారీచేశారు.

ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు
ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతున్న పీవో గోపాలక్రిష్ణ

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఐటీడీఏ పీవో తీవ్ర అసహనం


గూడెంకొత్తవీధి, జనవరి 19: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వుంటున్నారంటూ స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ షోకాజు నోటీసు జారీచేశారు. బుధవారం జీకేవీధి పర్యటనకు వచ్చిన ఆయన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీచేశారు. భోజనం మెనూ సక్రమంగా అమలుకావడంలేదని విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బెంచీలను పక్కన పడేసి విద్యార్థినులను నేలపై కూర్చోబెట్టడం, యూనిఫాం, బ్యాగ్‌లు సరిగా పంపిణీ చేయకపోవడంతో ప్రధానోపాధ్యాయురాలు మృధుభాషిణిపై తీవ్రఅసహనం వ్యక్తంచేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఆమెకు షోకాజు నోటీసు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. అనంతరం దేవరాపల్లి, వంచుల గ్రామ సచివాలయాలను సందర్శించారు. ఆయన ఏటీడబ్ల్యూవో పసుపులేటి వినాయకరావు, ఇతర అధికారులు వున్నారు. 


ఏకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌కు స్థల పరిశీలన


గూడెంకొత్తవీధి/చింతపల్లి, జనవరి 19: మండల కేంద్రంలో ఏకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ బుధవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూనిట్‌ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీడబ్ల్యూ పాడేరు ఈఈ డీవీఆర్‌ఎం రాజుని ఆదేశించారు. అనంతరం గిరిజన కాఫీ రైతులతో మాట్లాడిన పీవో.. కాఫీ నాణ్యత, దిగుబడుల పెంపు కోసం నూతన శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. అనంతరం చింతపల్లి చేరుకున్న ఆయన స్థానిక ఏకో పల్పింగ్‌ యూనిట్‌ని సందర్శించిన ఆయన కాఫీ గింజల పల్పింగ్‌, నాణ్యతను పరిశీలించారు. తరువాత హెచ్‌ఎన్‌టీసీని సందర్శించి నూతన మిరియాల వంగడాల అభివృద్ధిని పరిశీలించారు. నూతన భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాఫీ ప్రాజెక్టు ఏడీ భాస్కరరావు, ఎంపీడీవో లాలం సీతయ్య, డీఈ చాణిక్యరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T06:21:55+05:30 IST