క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

ABN , First Publish Date - 2022-08-20T05:02:15+05:30 IST

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జిల్లా కీర్తిని చాటాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సరిత అన్నారు.

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- హాజరైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల అర్బన్‌, ఆగస్టు 19 : క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జిల్లా  కీర్తిని చాటాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సరిత అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో శుక్ర వారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడాపోటీలకు చైర్‌పర్సన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి వాలీబాల్‌ పోటీలను ప్రారంభించి, మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఏదో ఒక ఆటను ఎంచు కొని రాణించి, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు. జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌ మాట్లాడుతూ జిల్లాలోని 12 మండలాల నుంచి దాదాపు 1,500 మంది విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌లో పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీవైఎస్‌వో రమేష్‌బాబు, ఎంఈవో సురేష్‌, వ్యాయాయ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, భరత్‌కుమార్‌, స్టేడియం ఇన్‌చార్జి జితేందర్‌, రజనీకాంత్‌, హైమావతి తదితరులు పాల్గొన్నారు.  


విజేతలు వీరే..

జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో కబడ్డీ బాలుర విభాగం లో కేటీదొడ్డి జట్టు ప్రథమ, అయిజ జట్టు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. వాలీబాల్‌  బాలుర విభాగంలో కేటీదొడ్డి జట్టు ప్రథమ, ఇటిక్యాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఖోఖో బాలుర విభాగంలో కేటీదొడ్డి ప్రథ మ, ఇటిక్యాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. వాలీబాల్‌ బాలికల విభాగంలో గట్టు జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. కేటీదొడ్డి ద్వితీయ స్థానాన్ని దక్కించు కున్నది. ఖోఖో బాలికల విభాగంలో అలంపూరు జట్టు ప్రథమ, ధరూరు జట్టు ద్వితీయ స్థానం,  కబడ్డీ బాలికల విభాగంలో మల్దకల్‌ జట్టు ప్రథమ, ధరూరు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. షాట్‌ఫుట్‌ బాలుర విభాగంలో కేటీదొడ్డి మండలానికి చెందిన నాగేంద్రబాబు ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకు న్నారు. ద్వితీయ స్థానంలో ఇటిక్యాల మండలానికి చెందిన శివ నిలిచారు. లాంగ్‌జంప్‌ బాలికల విభా గంలో అయిజకు చెందిన జయలక్ష్మి, ధరూరుకు చెందిన  మేఘన,  వంద మీటర్ల పరుగు పందెంలో కేటీదొడ్డికి చెందిన నాగేష్‌ ప్రథమ, మహేష్‌ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు డీఈవో ఎండీ సిరాజుద్దీన్‌ బహుమతులను అందించారు. 


సత్తా చాటిన కేటీదొడ్డి విద్యార్థులు 

కేటీదొడ్డి/ఇటిక్యాల : జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కేటీదొడ్డి మండల విద్యార్థులు సత్తా చాటుకున్నారు. ఈ సందర్భంగా వారికి జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌ క్రీడా దుస్తులను అందించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, టీఆర్‌ఎస్‌ మండల అధ్య క్షుడు ఉరుకుందు, రైతు సమన్వయ సమితి అధ్యక్షు డు హన్మంతు, పీఈటీలు ఆనంద్‌, మురళీ మోహన్‌, రవి, ప్రహ్లద్‌, భీమేష్‌ పాల్గొన్నారు. ఇటిక్యాలకు చెందిన విద్యార్థులు వాలీబాల్‌, ఖోఖో విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. వారిని జడ్పీటీసీ సభ్యుడు హనుమంతురెడ్డి, ఎంపీపీ స్నేహా శ్రీధర్‌రెడ్డి, ఎంఈవో రాజు, ఎంపీడీవో రాఘవ అభినందించారు. 



Updated Date - 2022-08-20T05:02:15+05:30 IST