అభివృద్ధి ఎక్కడో చూపించండి

ABN , First Publish Date - 2021-10-20T05:26:05+05:30 IST

‘వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది... నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించగలరా?..’

అభివృద్ధి ఎక్కడో చూపించండి
సమావేశంలో మట్లాడుతున్న టీడీపీ నాయకులు

- ఇకనైనా కౌంటర్లు మానుకోండి 

- ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై టీడీపీ నేతల ఆగ్రహం

హిందూపురం, అక్టోబరు 19: ‘వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది... నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించగలరా?..’ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌కు సవాల్‌ విసిరారు. ఇప్పటికైనా కౌంటర్లు మానుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయనకు హితవు పలికారు.  మంగళవారం పట్టణలోని ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయంలో హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కోట్లు ఖర్చుచేసి కార్పొరేట్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్ది నాణ్యమైన వైద్యసేవలు అందించామన్నారు. ప్రతిరోజు వేయి మందికిపైగా ఓపీతో అన్ని విబాగాల్లో నాణ్యమైన వైద్యసేవలు అందేవన్నారు. కానీ ప్రస్తుత వైసీపీ పాలనలో హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా పాలన పట్టుతప్పి వైద్య సేవలు అధ్వానంగా మారాయన్నారు.  వైద్యుల, సిబ్బంది, మందుల కొరత, పరికరాలు లేక నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం దూరం అవుతోందన్నారు. ఓపీ దారణంగా పడిపోయి ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు పెట్లాల్సివస్తోందన్నారు. మడకశిర ఉప కాలువ ద్వారా కృష్టా జలాలు తీసుకువచ్చి కనీసం చెరువులను నింపలేని దౌర్బాగ్య స్థితిలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఉన్నారని విమర్శించారు. రెండున్నర ఏళ్లగా హిందూపురం చూట్టు ఉన్న చెరువుల్లో ఒక్కచెరువునైనా నింపగలిగారా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో కురిసిన వర్షాలకు పెన్నానది ప్రవహిస్తే నీళ్లు తీసుకువచ్చినట్లు వైసీపీ నాయకులు కలరింగ్‌ ఇచ్చారన్నారు. వైసీపీ పాలనలో ఎక్కడ అభివృద్ధి చేశారో ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇకనైనా అనవసర కౌంటర్లు మానుకుని నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీకి టీడీపీ నాయకులు హితువుపలికారు. ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శులు కొల్లకుంట అంజినప్ప, రామాంజినమ్మ. టీడీపీ నాయకులు నాగరాజు, జేవి అనిల్‌కుమార్‌, రమే్‌షకుమార్‌, అమర్‌నాథ్‌, చంద్రమోహనయాదవ్‌, జేపీకే రాము, హెచఎం రాము, తెలుగుయువత పార్లమెంట్‌ కార్యదర్శి శ్రీనివాసులు, నెట్టప్ప, ఐటీడీపీ రామాంజనేయులు. నబిరసూల్‌, కొల్లకుంట శివశంకర్‌, దుర్గానవీన, మంజునాథ్‌, సిద్దార్ధ,  శ్రీనివాసరెడ్డి, నరేష్‌, విజయలక్ష్మీ, నజీర్‌, శ్రీనివాసులు నాయుడు, డైమాండ్‌ బాబా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:26:05+05:30 IST