జాతీయ నినాదంతో కదం తొక్కుతూ..

ABN , First Publish Date - 2022-08-14T06:06:55+05:30 IST

దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితో ముం దుకు సాగాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు.

జాతీయ నినాదంతో కదం తొక్కుతూ..
నందిగామ ర్యాలీలో మాట్లాడుతున్న దేవినేని ఉమా

నందిగామ, ఆగస్టు 13 : దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితో ముం దుకు సాగాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నంది గామ పట్టణానికి చెందిన తేజ డీవీఆర్‌ కళాశాల విదార్థులు పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఆళ్ల రాం బాబు, వాసిరెడ్డి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.  కాపా రవీంద్రబాబు, రామిరెడ్డి శ్రీధర్‌ తదితరులుపాల్గొన్నారు.  నేను సైతం అంటూ తన ఎడ్ల బండికి జాతీయ జెండా కట్టి దేశభక్తిని చాటుకున్నాడు. నిత్యం ఎడ్ల బండిపై ఇసుకను తోలుకుంటూ జీవించే ఆ కార్మికుడు చూపిన దేశభక్తిని అందరూ అభినందిస్తున్నారు. 

నందిగామ రూరల్‌ : లేబర్‌ అధికారి రాజేంద్రపాల్‌ క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు అనుమోలు శ్రీనివాసరావు, కార్య దర్శి లక్ష్మీనారాయణ, కోశాధికారి మహంకాళి వెంకటే శ్వరరావు, చవట సురేష్‌, కొండలరావు, తదితరులు పాల్గొన్నారు. నారాయణ ఆంగ్లో విద్యార్థులు  ర్యాలీ చేశారు. అడవిరావులపాడు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు  జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. సర్పంచ్‌ సూరా వెంకట నర్సమ్మ, వైస్‌ ఎంపీపీ ఆకుల హనుమం తరావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ దావీదు, హెచ్‌ఎం నారాయణరావు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. 

జగ్గయ్యపేట :  ఆజా దీకా అమృత్‌ మహోత్సవ్‌ భాగంగా  శనివారం చేగు విద్యాలయం నిర్వహించిన తిరంగా రన్‌  ఆకట్టు కుంది.  75 మీటర్ల ము వ్వన్నెల జెండాను పట్టు కుని, లయబద్ధంగా డ్రమ్ము లు మోగిస్తుండగా, భిన్న త్వంలో ఏకత్వానికి ప్రతీ కగా వివిధ రాష్ట్రాల వస్త్ర ధారణతోపాటు జాతీయ నేతల వేషధారణలతో అలరించారు.  చైతన్య, నారాయణ పాఠశాలలు, ఎస్జీఎస్‌ కళాశాల విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. ఎంఈవో రవీందర్‌ పాల్గొన్నారు. 

కంచికచర్ల రూరల్‌:  శ్రీఅక్షర విద్యా సంస్థల ఆధ్వర్యంలో 75 అడుగుల  జాతీయ పతాకంతో విద్యార్థులు జుజ్జూరు రోడ్డు, నెహ్రూ సెంటర్‌, బంకు సెంటర్‌లతో పాటు ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ చేశారు.  రూరల్‌ సీఐ నాగేంద్రకుమార్‌, పాఠశాల కరస్పాండెంట్‌ కాసరగడ్డ రామారావు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. సంస్కృతి విద్యామందిర్‌, గౌతమి పబ్లిక్‌ స్కూల్‌, ప్రభుత్వ పాఠశాల, ఎన్‌టీఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జాతీయ పతాకాలతో ర్యాలీ చేశారు. 

తిరువూరు : పట్టణం, మండలంలో మువ్వన్నెల పతాకాలతో శనివారం ర్యాలీలు నిర్వహించారు. మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శివకిరణ్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది జాతీయజెండాలతో  ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్ధులకు పలు పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్స్‌ రెబ్బు మురళీకృష్ణ, డాక్టర్‌ సుశీలరావు, డిగ్రీకాలేజీ వైస్‌ప్రిన్సిపాల్‌ అబుబాకర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రాం ఆఫీసర్‌ టి.వి.దుర్గాప్రసాద్‌  పాల్గొన్నారు.




Updated Date - 2022-08-14T06:06:55+05:30 IST