కొవిడ్‌ నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-05-15T06:22:45+05:30 IST

కొవిడ్‌ నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం వేల్పూర్‌లోని తన నివాసంలో బాల్కొండ నియోజకవర్గ ంలో కొవిడ్‌ ప్రభావం, నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై రెవెన్యూ, పోలీ సు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొవిడ్‌ నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

అధికారులకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశం
నిజామాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొవిడ్‌ నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం వేల్పూర్‌లోని తన నివాసంలో బాల్కొండ నియోజకవర్గ ంలో కొవిడ్‌ ప్రభావం, నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై రెవెన్యూ, పోలీ సు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నందున ప్రజ ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నార న్నారు. నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిం చడం వల్ల వైరస్‌ వ్యాప్తికి బ్రేక్‌ వేసినట్లయిందన్నారు. పోలీసు యంత్రాంగం నిర ంతరం గ్రామాల్లో పర్యటిస్తూ లాక్‌డౌన్‌ పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఉదయం లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో రైతులు, ఎరువులు, విత్తనాలు, పని ముట్లు కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని, దుకాణాలు తెరిచేలా యజమానులను ప్రోత్సహించాలన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలకు కొవిడ్‌ ని యంత్రణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు. ఈ సమీక్ష స మావేశంలో ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, రూరల్‌ సీఐ విజయ్‌కు మార్‌, తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-15T06:22:45+05:30 IST