సీఎం పర్యటిస్తే ట్రాఫిక్ ఆగిపోవాలా!

ABN , First Publish Date - 2021-10-07T06:22:32+05:30 IST

మంత్రులూ, ముఖ్యమంత్రులూ పర్య టిస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభిం చిపోతే అది వారి హోదాకు గుర్తింపా! మొన్న రెండవ తేదీ నాడు విజయవాడలో ముఖ్యమంత్రి ఏదో ప్రారంభం చేస్తుంటే, హైవే మొత్తం ...

సీఎం పర్యటిస్తే ట్రాఫిక్ ఆగిపోవాలా!

మంత్రులూ, ముఖ్యమంత్రులూ పర్య టిస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభిం చిపోతే అది వారి హోదాకు గుర్తింపా! మొన్న రెండవ తేదీ నాడు విజయవాడలో ముఖ్యమంత్రి ఏదో ప్రారంభం చేస్తుంటే, హైవే మొత్తం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు. మాములుగా అయితే ఒంగోలు నుంచి విజయవాడకు మూడు గంటలు ప్రయాణం. ఆ రోజు ఏడుగంటలు పట్టింది. అంటే నాలుగుగంటలు ఎక్కువ. ఎందుకిలా జరుగుతోంది?  ఆసుపత్రులకు,  కోర్టులకు, ఉద్యోగాలకు వెళ్లే ప్రయాణికుల పరిస్థితి ఎమిటి? ట్రాఫిక్ ఆపకుండా  ముఖ్యమంత్రులు ప్రారంభోత్సవాలు చేయలేరా?


తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజూ ప్రారంభోత్సవాలు చేస్తుంటారు. అక్కడ కూడా ఇలాగే జరుగుతుందా!  ఒక్క కేసీఆర్‌ కాదు ఏ ముఖ్యమంత్రిగాని, ప్రధానమంత్రులు గాని ఎవరయినా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదు. ఒక పక్క ముఖ్యమంత్రి పోతుంటే, రెండవ పక్క ప్రయాణీకులను అనుమతిస్తే వారికి కలిగే ఇబ్బంది ఏమిటి? ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ మం త్రులు వారిని ఇబ్బందిపెట్టడం సరి అయిన పనికాదు. ఈ రోజు ముఖ్యమంత్రి ఒంగోలు వస్తున్నారు. ఒంగోలు ప్రజలు రోడ్ల మీద తిరగటానికి  ఎన్ని ఇబ్బందులు పడాలో! ఏదిఏమైనా ముఖ్యమంత్రి పర్యటనలో అక్కడి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదే అన్న విషయం మరువకూడదు.

నార్నెవెంకటసుబ్బయ్య

Updated Date - 2021-10-07T06:22:32+05:30 IST