భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలవాలి

ABN , First Publish Date - 2022-05-16T05:14:13+05:30 IST

తమ రచనలతో కవులు, కళాకారులు భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలవాలి
నాగర్‌కర్నూల్‌ జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ చేస్తున్న మంత్రి

- మేధావి వర్గానికి మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపు

 నాగర్‌కర్నూల్‌, మే 15 (ఆంధ్రజ్యోతి):  తమ రచనలతో కవులు, కళాకారులు భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నా గర్‌కర్నూల్‌ సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ సభకు మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సారస్వత పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లూరి శి వారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన నాగర్‌కర్నూల్‌ జిల్లా సమగ్ర స్వరూపానికి పుస్తక రూపం ఇవ్వడం గొప్ప సాహసమన్నారు. జిల్లా చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించా లనే గొప్ప సంకల్పానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.  నాగర్‌కర్నూల్‌ సమగ్ర సమాచారం పుస్తకాలను పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకందిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జడ్పీచైర్‌పర్సన్‌ పద్మావతి మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం కవులను గొప్పగా ప్రోత్సహిస్తుందని, గోరటి వెంకన్న కు ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు మొగులయ్యను పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేసి న విషయాన్ని గుర్తు చేశారు.  పేదరికం నుంచి కవి పుడుతాడని తన జీవిత అ నుభవాలను జోడించి కవిత్వం రాసే సాహితీవేత్తలు శాస్త్రవేత్తల కంటే గొప్పవార ని ఎంపీ పోతుగంటి రాములు పేర్కొన్నారు.  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మా ట్లాడుతూ ఈ పుస్తకం జిల్లా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. పుస్తక రూపం ఇవ్వడానికి ప్రయత్నించిన 35మంది రచయితలను ఆయన అభినందిం చారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచే వి ధంగా  ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో అధునా తనమైన గ్రంథాలయ నిర్మాణానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు తె లిపారు. పుస్తకావిష్కరణ సందర్భంగా 120మంది కవులు కవితాగానం చేయడం  అభినందనీయమని తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య పేర్కొన్నారు. జిల్లా చరిత్రను పుస్తక రూపంలో ఇవ్వడానికి సహకరించిన వారందరికీ వనపట్ల సుబ్బయ్య కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-05-16T05:14:13+05:30 IST