మెరుగైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2022-05-21T06:06:55+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి
భువనగిరి ఆస్పత్రిలో శిశు విభాగాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

మందుల కొరత లేదు

 ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తా

 ఎయిమ్స్‌కు కేంద్రం నిధులు సున్నా

 మూడేళ్లయినా పూర్తిస్థాయి వైద్యసేవలు ఏవీ?

 ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 

భువనగిరి రూరల్‌, మే 20: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో రూ.46లక్షలతో ఏర్పాటుచేసిన డీపీసీఎ్‌సయూ, ఎస్‌ఎంసీయూ 30పడకల వార్డును శుక్రవారం ప్రారంభించారు. రూ.1.25కోట్లతో నిర్మించే ఐదు పడకల టీడయాగ్నొస్టిక్‌ హబ్‌ రేడియాలజీ విభాగ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి మరమ్మతులకు రూ.74లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మె ల్యే శేఖర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు పట్టణంలోని స్లమ్‌ ఏరియాలో మూడు బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తెస్తామన్నా రు. అదే విధంగా రూ.1కోటితో అర్బన్‌ పీహెచ్‌సీ మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. కిడ్నీ రోగుల ఆరోగ్య సంరక్షణకు ఐదు పడకల డయాలసిస్‌ సెంటరును నెల రోజుల్లోగా వినియోగంలోకి తెస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రభుత్వ ఆస్పత్పుల్లో కాన్సులు 30శాతం ఉంటే ప్రస్తుతం 56శాతానికి పెరిగాయన్నారు. 33 జిల్లాలకు 33 మెడికల్‌ కళాశాలలను సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారని, భువనగిరిలో కూడా వైద్య కళాశాల ఏర్పాటుకు చొరవ చూపుతామన్నారు.


మందులకు నిధులు పెంచాం

ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు అనవసరంగా మందుల చీటీని బయటకు రాయకూడదని, ఆస్పత్రుల్లో మందుల కొరత లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పీహెచ్‌సీ, ఏరి యా ఆస్పత్రుల వైద్యాధికారులు,ప్రైవేటు ఆస్పత్రుల వై ద్యులు, గైనకాలజిస్టులు, ఏఎన్‌ఎం, హెల్త్‌ సూపర్‌వైజర్ల తో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడా రు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులకు నిధులను రూ.200 కోట్ల నుంచి రూ.500కోట్లకు పెంచామన్నారు. ఆస్పత్రులకు మంజూరు చేసిన వైద్యపరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. ఈసారి ఎవరికీ చెప్పకుండా జిల్లాలో ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు.


పర్యటన సాగింది ఇలా..

మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఉదయం 11.30గంటలకు బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించారు. అనంతరం స్థానిక డాల్ఫిన్‌ హోటల్‌నుంచి ర్యాలీగా భువనగిరిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి 12.14గంటల కు చేరుకున్నారు. ఆస్పత్రిలో డీపీసీఎ్‌సయూ, ఎం సీయూ, ఎస్‌ఎంసీయూ యునిట్లను ప్రారంభించా రు. 12.20గంటలకు టీడయాగ్నొస్టిక్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. 12.30గంటలకు భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించా రు. 1గంటకు కలెక్టరేట్‌కు చేరుకుని భోజ నం చేశారు. 2గంటలకు కలెక్టరేట్‌లోని స మావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య, ఏరియా ఆస్పత్రు ల వైద్యాధికారులు, గైనకాలజిస్టులు, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, ఏఎన్‌ఎం, హెల్త్‌ సూపర్‌ వైజర్లతో వైద్య ఆరోగ్య సేవలపై 2గంటలకుపైగా సమీక్ష సమావేశం నిర్వహించి, 4.20గంటలకు భువనగిరి నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.


ఎయిమ్స్‌ను గాలికొదిలేసిన కేంద్రం

ఎయిమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని హరీశ్‌రావు అన్నారు. బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ను ఆయన సందర్శించారు. క్యాంప్‌సలోని డైరెక్టర్‌ కార్యాలయంతో పాటు గల్స్‌ హాస్టల్‌ భవనం, ఔట్‌ పేషంట్‌ విభాగాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎయిమ్స్‌ను చూస్తే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు 200 ఎకరాల స్థలాన్ని, భవన సముదాయాలను బదలాయించిందని, అయితే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం బదలాయించలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఎయిమ్స్‌ను ప్రారంభించి మూడేళ్లయినా సౌకర్యాలు లేక వైద్య విద్యార్థులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి ఎయిమ్స్‌ అధికారులు అంచనా రూపొందించలేదని, టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఎయిమ్స్‌లో నేటికీ బ్లడ్‌ బ్యాంకు, ఆపరేషన్‌ థియేటర్స్‌ అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమన్నారు. డాక్టర్‌ పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయని, 812 నర్సు పోస్టులకు 200మాత్రమే భర్తీ చేసి పీహెచ్‌సీ స్థాయి సేవలు అందిస్తుండడటం దారుణమన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీయాలన్నారు. ఎయిమ్స్‌లో ఒక్క ఆపరేషన్‌, డెలివరీ చేయలేదని, ఇన్‌పేషంట్లకు వసతి కూడా లేదన్నారు. దీంతో 212మంది వైద్య విద్యార్థులకు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాక్టికల్స్‌ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సగుప్తా, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కిశోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి, నల్లగొండ జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, కలెక్టర్‌ పమేలాసత్పథి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ గడాల శ్రీనివా్‌సరావు, హెల్త్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌, నాయకులు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడల అమరేందర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:06:55+05:30 IST