Advertisement

సెలెబ్రిటీలు అయినంత మాత్రాన కేసు నమోదు చేయకూడదా: ఎన్సీబీ కమిషనర్


గత రెండు రోజులుగా షారూఖ్‌ ఖాన్ వార్తల్లోనే  ఉంటున్నాడు. అందుకు కారణం అతడి కొడుకు ఆర్యన్ ఖాన్. ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ పట్టుబడటంతో ఆర్యన్ సహా 8మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. క్రూయిజ్‌లో 1000మంది ఉండగా వీరిని మాత్రమే అరెస్టు చేయడంతో ఎన్సీబీ అధికారుల వ్యవహారిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా కూడా ఈ కేసుపై దృష్టి సారించడంతో పేరు, ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రాన సెలబ్రిటీలపై కేసును నమోదు చేయకూడదా అని ఎన్సీబీ అధికారి ప్రశ్నిస్తున్నారు.


మాదక ద్రవ్యాలను సేవించడం, డ్రగ్స్‌ను కొనుగోలు చేయడం వంటి కారణాలతో సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్(ఎన్‌డీపీఎస్)లోని 4 సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేసి వీరిని అరెస్టు చేశారు. మెడికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్ కోర్టులో వీరిని హాజరుపరిచారు. చరస్‌ను సేవించినట్టు అతడి మీద కేసును నమోదు చేశారు. అతడిపై మోపిన అభియోగాలు నిరూపితమైతే ఒక ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రియా చక్రవర్తి కేసును వాదించిన సతీశ్ మనీశ్‌షిండేనే ఈ కేసును కూడా వాదిస్తున్నారు. ఆర్యన్‌ను కాపాడటానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 


ఎన్సీబీ జోనల్ కమిషనర్ సమీర్ వాంఖడే ఈ కేసు విషయమై మీడియాతో మాట్లాడారు. ‘‘ సెలెబ్రిటీ కేసులపై మాత్రమే మీడియా దృష్టి సారిస్తుంది. ఎందుకంటే వారు పేరు, ప్రఖ్యాతలు ఉన్నవారు. మేం సెలెబ్రిటీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటామనుకుంటున్నారు. మేం ఇప్పటి వరకు 90 కేసులను నమోదు చేయగా ఒకటి మాత్రమే సెలబ్రిటీది. ఆ సెలబ్రిటీలు కూడా నిబంధనలను అతిక్రమించారు. కొన్ని నెలలు పడిన శ్రమ అనంతరం మాకు అందిన సమాచారం ప్రకారం రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నాం. పేరు, ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రాన సెలబ్రిటీలపై కేసును నమోదు చేయకూడదా’’ అని అడిగారు. 






Advertisement

Bollywoodమరిన్ని...