Abn logo
Sep 26 2021 @ 00:27AM

భావి పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి

ఉత్పత్తులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరిరూరల్‌, సెప్టెంబరు 25: భావి పారిశ్రామికవేత్తలను తయా రు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత పారిశ్రామికవేత్తలపై ఉందని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. ఆజాద్‌కీ అమృత్‌ మహోత్సవంలో భాగంగా శనివారం వివిధ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శనలో ఆమె పాల్గొని తిలకించారు. అనంతరం జిల్లాలోని ఉత్పత్తి, ఎగుమతిదారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఔషధ తయారీలో జిల్లా ముందంజలో ఉండడం గర్వకారణమన్నారు. పారిశ్రామికవేత్తలు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, సామాజిక బాధ్యతతో దేశ ప్రగతికి చేయూతనందిస్తున్నారన్నారు. టీఎ్‌సఐపాస్‌ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే వారికి అనుమతులు ఇచ్చి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రదర్శనలో గాజు, స్టీల్‌, ఆహార, చేనేత ఉత్పత్తులు, పేలుడు పదార్థాలు, ఆయుర్వేద, ఔషధ ఉత్పత్తులను ఉంచారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ శ్రీలక్ష్మీ, ఇండస్ర్టీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ వినోద్‌, ఎంఎ్‌సఎం ఈడీ నవీన్‌కుమార్‌, శాస్ర్తీ, చేనేత అధికారులు గోకులే, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.