వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపాలి

ABN , First Publish Date - 2021-07-31T04:34:06+05:30 IST

రైతులు సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూ పితే అధిక లాభాలు పొందవచ్చునని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు.

వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపాలి
లెమన్‌ గ్రాస్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా

పెద్దమందడి, జూలై 30: రైతులు సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూ పితే అధిక లాభాలు పొందవచ్చునని కలెక్టర్‌  యాస్మిన్‌ బాషా అన్నారు.  హైదరాబాద్‌కు చెందిన సేంద్రియ ఔషధ సుగంధ మొక్కల సంస్థ ఆధ్వ ర్యంలో మండలంలోని చీకరుచెట్టు తండాలో నిమ్మ గడ్డి సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్ర మానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. తక్కువ ఖర్చుతో సాగు చేసే నిమ్మగడ్డి పెంప కంపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే ఓ స్వచ్ఛంద సంస్థ పెద్దమందడి మండలంలోని 11 గ్రామాలను దత్తతకు తీసుకొని 50 ఎకరాల్లో నిమ్మ గడ్డి సాగు చేస్తున్నారని తెలిపారు. అధిక మొత్తం లో నిమ్మగడ్డి సాగుచేస్తే ఈ ప్రాంతంలోనే నూనె తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు.   రైతులు ఒక్కసారి నిమ్మగడ్డిని సాగు చేస్తే 8 సంవ త్సరాల వరకు దిగుబడి వస్తూనే ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు నిమ్మగడ్డి విత్తనాలను, స్టంప్స్‌ను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మేఘారెడ్డి,  రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి, శాస్త్రవేత్తలు కిరణ్‌బా బు, కోటేష్‌కుమార్‌, శ్రీనివాస్‌, జాన్సా, డీఆర్‌డీవో పీడీ నరసిహులు, ఉద్యాన శాఖ జిల్లా సహాయ సంచాలయకులు విజయభాస్కర్‌, హెచ్‌ శ్రీకాంత్‌, పంచాయతీరాజ్‌ డీఈ ప్రమోద్‌కుమార్‌, ఏవో మల్ల య్య,  సర్పంచ్‌లు రాధాకృష్ణ,  రైతులు తదితరు లు పాల్గొన్నారు.

 అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

వనపర్తి అర్బన్‌, జూలై 30: తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయా లని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికా రులతో బృహత్‌ పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, రైతు వేదిక భవన నిర్మాణాలు తదితర పనులపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ మండల కేంద్రంలో  సేకరించిన 10 ఎకరాల స్థలంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి గులమోహర్‌, నిమ్‌ తదితర మొక్కలు నాటాలని అన్నారు. మంగళవారం వరకు రైతు వేదికల దగ్గర మొక్కలు నాటి రిపోర్టు అందజే యాలన్నారు. 2014 నుంచి మునిసిపల్‌ పరిధిలో పది శాతం లేఅవుట్‌ భూములను అప్పగించాలని కమిష నర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీపీవో సురేష్‌ కు మార్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఈఈలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-31T04:34:06+05:30 IST