కరోనా నియంత్రణకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-04-21T05:55:46+05:30 IST

కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి చక్రవర్తి కోరారు.

కరోనా నియంత్రణకు సహకరించాలి
హుజూర్‌నగర్‌లో కరోనా పరీక్షలు చేయించుకుంటున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి చక్రవర్తి

హుజూర్‌నగర్‌/ సూర్యాపేటటౌన్‌/ మద్దిరాల/ కోదాడ/ అర్వపల్లి, ఏప్రిల్‌ 20: కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి చక్రవర్తి కోరారు. హుజూర్‌నగర్‌లోని కోర్టుహాల్‌లో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జక్కుల నాగేశ్వరరావు, ఇందిరాల రామకృష్ణ, శ్రీనివాస్‌, శ్రావణ్‌, సత్యనారాయణ, ప్రవీణ్‌, గోపాలకృష్ణ, నర్సింహారావు, శ్రీనివాసరెడ్డి, సుందర్‌, నాగార్జున, సురేష్‌ ఉన్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, గుడిపాటి నర్సయ్య, అంజద్‌అలీ, కర్ణాకర్‌రెడ్డి, నరేందర్‌నాయుడు, బొడ్డుసాయి పాల్గొన్నారు. నూతన్‌కల్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రైతు స మన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌ఏ రజాక్‌, ఆయన సతీమణి మద్దిరాల సర్పంచ్‌ ఇంతియాజ్‌బేగం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సూర్యాపేటలో మునిసి పల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ పారిశుధ్య కార్మికులకు గ్లౌజులు, హైడ్రోక్లోరిన్‌ను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, కౌన్సిలర్‌ తాహేర్‌ పాష, సుంకరి రమేష్‌, మున్సిపల్‌ శానిటరి ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. సూర్యాపేటలోని 37వ వార్డులో కౌన్సిలర్‌ బైరు శైలేందర్‌గౌడ్‌ సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కోదాడ పట్టణంలోని పోలీసుస్టేషన్‌, కోర్టు, ఆర్డీవో కార్యాలయం, బస్టాండ్‌లో ము నిసిపల్‌ సిబ్బంది హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయించినట్లు  హెల్త్‌ అసిస్టెంట్‌ మేరిగ అశోక్‌ తెలిపారు. అర్వపల్లిలో సర్పంచ్‌ బైరబోయిన సునితరామలింగయ్య, సీతారాంపురంలో సర్పంచ్‌ సుజాత కరోనాపై అవగాహన కల్పించారు. 

Updated Date - 2021-04-21T05:55:46+05:30 IST