నిబంధనల మేరకే ఎన్నికల్లో ఖర్చుచేయాలి

ABN , First Publish Date - 2021-10-18T05:30:00+05:30 IST

ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు నిబంధనల మేరకే ఖర్చుపెట్టాలని, వాటికి సంబంధించిన నివేదికలు సమర్పించాలని ఉప ఎన్నికల వ్యయ పరిశీలకులు షీల్‌ ఆశిష్‌ అన్నారు.

నిబంధనల మేరకే ఎన్నికల్లో ఖర్చుచేయాలి
ఎన్నికల వ్యయంపై సమావేశంలో మాట్లాడుతున్న షీల్‌ ఆశిష్‌

ఉప ఎన్నికల వ్యయ పరిశీలకులు

బద్వేలు, అక్టోబర్‌ 18: ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు నిబంధనల మేరకే ఖర్చుపెట్టాలని, వాటికి సంబంధించిన నివేదికలు సమర్పించాలని ఉప ఎన్నికల వ్యయ పరిశీలకులు షీల్‌ ఆశిష్‌ అన్నారు. ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లో ఆయా పార్టీల అభ్యర్థి ప్రతినిధులతో ఎన్నికల ఖర్చులపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షీల్‌ ఆశిష్‌ మాట్లాడుత ూ ఉపఎన్నికలలో పోటీచేసే వారు ఎన్నికల కమిషన నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఈ నెల 22వ తేది తిరిగి ఈ అంశంపై సమావేశం జరుగుతుందని, ఆ సమయానికి ఖర్చులు సరిచూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతనగార్గ్‌, అకౌంటింగ్‌ టీం సభ్యులు, అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులు పాల్గొన్నారు.


ఉప ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

ఈ నెల 30వ తేదీన జరగబోయే ఉప ఎన్నికల ఏర్పాట్లను సోమవారం రిటర్నింగ్‌ అధికారి కేతనగార్గ్‌ పరిశీలించారు. పట్టణంలోని బాలయోగి గురుకుల పాఠశాలకు చేరుకుని అక్కడి కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నికల అధికారులతో శిక్షణ కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే కౌంటింగ్‌ కేంద్రంలో విద్యుత సౌకర్యంతో పాటు ఫ్యాన, లైట్‌, ఫర్నిచర్‌, టాయిలెట్స్‌, మీడియా రూమ్‌, నీటి సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు, సూచనలు అందించారు.

Updated Date - 2021-10-18T05:30:00+05:30 IST