Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 26: జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించిన తరువాత నోడల్‌ అఽధికారులు  క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని, ఎప్ప టికప్పుడు నివేదిక సమర్పించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత  కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం  పౌరసరఫరాలు, రవాణా శాఖ అఽధికారులు, నోడల్‌ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 41 మంది వీఆర్వోలకు నోడల్‌ అధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే సమాచారం అందించాలన్నారు. ట్రాక్‌ షీట్‌ అన్‌లైన్‌ జనరేషన్‌, రైతుల పేమెంట్‌ చెల్లింపులపై దృష్టి సారించాలన్నారు. సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, మేనేజర్‌ హరికృష్ణ, డీటీవో కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement