పేదల అవసరాలకు అనుగుణంగా పాలన చేయాలి

ABN , First Publish Date - 2021-10-28T05:26:29+05:30 IST

పేదల అవసరాలకు అనుగుణంగా ఎవరైతే పాలన చేస్తారో వారే నిజమైన నాయకులని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పేదల అవసరాలకు అనుగుణంగా పాలన చేయాలి
సంగమేశ్వర కాలనీలో మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం

బాన్సువాడ, అక్టోబరు 27: పేదల అవసరాలకు అనుగుణంగా ఎవరైతే పాలన చేస్తారో వారే నిజమైన నాయకులని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధ వారం బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేదల అవస రాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయిస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండల, గ్రామాల ప్రజల సౌకర్యం కోసం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ నిధుల ద్వారా కల్యాణ మండపాలను నిర్మిస్తున్నామన్నారు. పేదలకు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశ్యంతో తక్కువ ఖర్చుతో కల్యాణ మండపాలను నిర్వహిం చుకోవడానికి ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడుతున్నామన్నారు. కుల, మతాలకు అతీతం గా అన్ని వర్గాలకు అన్ని వసతులతో కల్యాణ మండపాలను నిర్మిస్తున్నామన్నారు. బాన్సువా డ పట్టణంలో సొంత ఇంటి స్థలం లేని పేదల కోసం సంగమేశ్వర కాలనీలో 69 ఎకరాలను సేకరించి, 2 వేల మందికి, బీడీ కార్మికుల కాలనీలో 33 ఎకరాల్లో ఇంటి స్థలాలను అందించి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించామన్నారు. అదేవిధంగా తాడ్కోల్‌ శివారులో 28 ఎకరాల స్థలంలో వెయ్యి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతీ పేదవారికి డబుల్‌ బెడ్‌రూంలు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2021-10-28T05:26:29+05:30 IST