బీసీ దినంగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-10-20T08:15:45+05:30 IST

ప్రభుత్వ క్యాలెండర్‌లో అక్టోబరు 18 తేదీని బీసీ దినంగా ప్రకటించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం కోరారు. సోమవారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడుతూ 56 కులాలకు కార్పొరేషన్‌ చైర్మన్లు ప్రకటించిన

బీసీ దినంగా ప్రకటించాలి

 స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస : ప్రభుత్వ క్యాలెండర్‌లో అక్టోబరు 18 తేదీని బీసీ దినంగా ప్రకటించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం కోరారు. సోమవారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడుతూ 56 కులాలకు కార్పొరేషన్‌ చైర్మన్లు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని తెలిపారు. గత పాలకులు బీసీలను విస్మ రించారని ఆరోపించారు. జగన్‌ పాదయాత్ర  సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. బీసీలకు జిల్లా నుంచి తనకు సభాపతిని చేయగా ఇద్దరుకు మంత్రి పదవులు కట్టిబెట్టారన్నారు. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఇద్దరి బీసీను ఎంపికచేశారన్నారు.


ఏడాదిన్నర కాలంలో వివిద పథకాల ద్వారా 2,71,33,251 మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ఫ ఇచ్ఛాపురం : బీసీలకు సీఎం ముఖ్యమంత్రి జగన్‌మ్మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని  మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, రెడ్డికుల ప్రతినిధులు చాట్ల తులసీదాస్‌రెడ్డి, పిలక సంతు, నీలాపు ఢిల్లీ, కారంగి మోహన్‌రావు, డి.నూకయ్యరెడ్డి,  సాడి సహదేవ్‌రెడ్డి,   నారాయణమ్మ, రంగాల కృష్ణారెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు.   దుక్క లోకేశ్వరరావురెడ్డికి రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంతో తాము సీఎంకు  రుణపడి ఉంటామని పేర్కొన్నారు.


సోషల్‌మీడియాలో కొందరు అసత్య ప్రచారం, కించపరిచేలా వ్యాఖ్యనించడం తగదని హితవుపలికారు. ఫ పోలాకి : జిల్లాకు ఆరు కార్పొరేషన్‌ చైర్మన్ల పదవులు కేటాయించి సీఎం జగన్‌ ప్రాధాన్యం కల్పించారని వైసీపీ యువజన విభాగం నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య అన్నారు. సోమవారం సుసరాంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో దుంపల భాస్కరరావు, తమ్మినాన భూషణరావు, కరిమి రాజేశ్వరరావు, కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


 


Updated Date - 2020-10-20T08:15:45+05:30 IST