సకాలంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-05-08T05:28:04+05:30 IST

కొవిడ్‌ను రూపుమాపడానికి ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సర్వేను అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పూర్తిచేయాలని, ఏ ఒక్క ఇంటిని కూడా వదలవద్దని నూరు శాతం సర్వే సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌.లత సూచించారు.

సకాలంలో పూర్తి చేయాలి

నిజామాబాద్‌ రూరల్‌ / నవీపేట, మే 7: కొవిడ్‌ను రూపుమాపడానికి ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సర్వేను అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పూర్తిచేయాలని, ఏ ఒక్క ఇంటిని కూడా వదలవద్దని నూరు శాతం సర్వే సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌.లత సూచించారు. శుక్రవారం నిజామాబాద్‌రూరల్‌ మండలం ఆకుల కొండూరు, తిర్మన్‌పల్లి, నవీపేట మండలం జన్నెపల్లి గ్రామాల్లో ఇంటింటి సర్వే పరిశీలించారు. ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి సర్వే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా లక్షణాలున్న వ్యక్తులు తెలిసినవప్పుడు వారిని కచ్చితంగా హోం ఐసోలేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని, వారికి వెంటనే మెడికల్‌ కిట్‌ అందజేయాలని అన్నారు. ఇతర సమస్యలుంటే జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేయాలని సూచించారు. సర్వే నిర్వహిస్తున్న  బృందం సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ వివరాలు సేకరించాలన్నారు. సర్వేలో స్థానిక ప్రజాప్రతినిదుల సహకారం సైతం తీసుకోవాలని సూచించారు. ఎవరైనా సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా, అమర్యాదగా ప్రవర్తించినా వెంటనేపై అధికారుల దృష్టికి తీసుకురావాలని, భయపడవద్దని భరోసా ఇచ్చారు. రూరల్‌ ఎంపీడీవో ఎం.మల్లేష్‌, నవీపేట ఎంపీడీవో సయ్యద్‌సాజిద్‌అలీ, సర్పంచ్‌లు అశోక్‌కుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సబిత, పంచాయతీ కార్యదర్శులు ధీరజ్‌, స్వప్న, కవిత ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-08T05:28:04+05:30 IST