RSS, బజరంగ్‌ దళ్, VHPలను బ్యాన్ చేయాలి: కాంగ్రెస్ నేత

ABN , First Publish Date - 2022-04-21T02:17:37+05:30 IST

బుధవారం ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘పీఎఫ్ఐని నేషేధించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం అందింది. ఆ సంస్థను నిషేధిస్తే నిషేధించండి. కానీ, దానితో పాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, శ్రీరాం సేన, బజరంగ్‌ దళ్‌, పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐలను..

RSS, బజరంగ్‌ దళ్, VHPలను బ్యాన్ చేయాలి: కాంగ్రెస్ నేత

బెంగళూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), శ్రీరాం సేన, బజరంగ్‌ దళ్‌లతో పాటు పాపులర్ ఫ్రాంట్ ఆప్ ఇండియా (పీఎఫ్ఐ), సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్‌డీపీఐ)లను నిషేధించాలని కర్ణాటక కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఎం.బీ.పాటిల్ డిమాండ్ చేశారు. ఈ సంస్థలను నిషేధించే నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంటే దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుందని ఆయన అన్నారు.


బుధవారం ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘పీఎఫ్ఐని నేషేధించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం అందింది. ఆ సంస్థను నిషేధిస్తే నిషేధించండి. కానీ, దానితో పాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, శ్రీరాం సేన, బజరంగ్‌ దళ్‌, పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐలను కూడా నిషేధించండి. అలాగే ఏఐఎంఐఎంను కూడా నిషేధించండి. ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వీటన్నిటినీ నిషేధించాలని బీజేపీ అనుకుంటే దానికి కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇస్తుంది’’ అని అన్నారు.

Updated Date - 2022-04-21T02:17:37+05:30 IST