నిశ్చితార్థం తర్వాత ఈ తప్పులను అస్సలు చేయవద్దు.. లేదంటే రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది

ABN , First Publish Date - 2022-02-13T15:34:38+05:30 IST

పెళ్లి అనేది ఏడు జన్మల బంధం అని అంటారు.

నిశ్చితార్థం తర్వాత ఈ తప్పులను అస్సలు చేయవద్దు.. లేదంటే రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది

పెళ్లి అనేది ఏడు జన్మల బంధం అని అంటారు. పెద్దలు కుదిర్చిన మ్యారేజ్‌లో.. ఇద్దరు తెలియని వ్యక్తులు ఒకరినొకరు అప్పుడే తెలుసుకుంటారు. జీవితాన్ని పూలబాట చేసుకోవాలని కలలుగంటారు. అయితే ఇటీవలి కాలంలో పెద్దలు కుదిర్చిన వివాహాలలో కూడా.. భార్యాభర్తలుగా మారబోయేవారికి కొంత సమయం దొరుకుతోంది. ఈ సమయంలో వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి సందర్భంలో ఒకరి ప్రవర్తనను మరొకరు ఎంతో దగ్గరగా తెలుసుకుంటారు. ఈ రిలేషన్‌షిప్‌లో అన్నీ కొత్తగా ఉన్నప్పటికీ.. ఎక్కడైనా ప్రాక్టికల్ మిస్టేక్ చోటుచేసుకుంటే అది రిలేషన్‌షిప్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగుతాయి. తర్వాత వివాహం క్యాన్సిల్ అయ్యే వరకూ పరిస్థితులు దారితీయవచ్చు. అందుకే నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఉన్న కాలం చాలా సున్నితమైనదని చెబుతారు. కాబోయే జంటలు చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


భార్యాభర్తల మధ్య ఆధిపత్య ధోరణి ఉండటం కనిపిస్తుంటుంది. కొందరు భాగస్వామిపై తమ అభిప్రాయాలను రుద్దేందుకు ప్రయత్నిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో పరుష పదజాలాన్ని కూడా వాడుతుంటారు. ఫలితంగా వారి మధ్య బంధం దెబ్బతింటుంది.  ఫలితంగా వారి వివాహం ప్రశ్నార్థకంగా మారవచ్చు. అందుకే కాబోయే కొత్త దంపతులు ఇటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి. కొత్త జంటల మధ్య సంబంధాల ఏర్పడేముందు వారు ఉత్సాహంతో తరచూ కలుసుకుంటుంటారు. ఈ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. అయితే ఇటువంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. తరచూ కలుసుకోవడం వల్ల వారిద్దరిలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తుతాయి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ప్రారంభమవుతుంది. ఇవి ఎక్కడికి దారి తీస్తాయో ఎవరూ చెప్పలేరు. అటువంటి పరిస్థితిలో ఒకరిపై మరొకరు కోపం తెచ్చుకునే బదులు సామరస్యంగా మాట్లాడుకుని, గొడవను నియంత్రించేందుకు ప్రయత్నించాలి. కొన్నిసార్లు కొందరు తమ భాగస్వామిని వారికి అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల రిలేషన్‌షిప్‌ సవ్యంగా సాగుతుందని వారు భావిస్తుంటారు. అయితే ఇది  వారి మధ్య సంబంధం చెడిపోవడానికి కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఎవరికైనా వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అందుకే మీ భాగస్వామి ఎలా ఉన్నారో అలాగే స్వీకరించండి. అలాకాదని మీకు అనుగుణంగా ఉండాలని మొండిగా ప్రవర్తిస్తే సంబంధాలు చెడిపోతాయని గుర్తుంచుకోండి. 

Updated Date - 2022-02-13T15:34:38+05:30 IST