9200 పైన స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌

ABN , First Publish Date - 2020-05-25T05:56:36+05:30 IST

నిఫ్టీ గత వారంలో కనిష్ఠ స్థాయి 8800 వరకు దిగజారి రికవరీ సాధించింది. తదుపరి వారం అంతా సైడ్‌వే్‌సలో సంచరించింది. టెక్నికల్‌గా మానసిక అవధి 9000 కన్నా స్వల్పంగా పైన ముగియడం

9200 పైన స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌

నిఫ్టీ గత వారంలో కనిష్ఠ స్థాయి 8800 వరకు దిగజారి రికవరీ సాధించింది. తదుపరి వారం అంతా సైడ్‌వే్‌సలో సంచరించింది. టెక్నికల్‌గా మానసిక అవధి 9000 కన్నా స్వల్పంగా పైన ముగియడం ట్రెండ్‌లో సానుకూలత సంకేతం. అయితే వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల్లో ముగియడం అనిశ్చితిని కూడా సూచిస్తోంది. వచ్చే వారంలో మైనర్‌ రికవరీ లేదా కన్సాలిడేషన్‌ ఉండవచ్చనేందుకు ఇది సంకేతం. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే మార్కెట్‌ రానున్న కొద్ది రోజుల్లో 9000 వద్ద మరింత బలపడడం అవసరం. అలాగే 25 డిఎంఏ వద్ద మరోసారి పరీక్షకు సమాయత్తం అవుతోంది. 


బుల్లిష్‌ స్థాయిలు: రికవరీ బాటలో పురోగమిస్తే స్వల్పకాలిక నిరోధం వద్ద 9200 వద్ద పరీక్ష ఎదురు కావచ్చు. ఆ పైన నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. ప్రధాన నిరోధం 9400. ఆ పైన బలంగా క్లోజరుతే  స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ప్రవేశిస్తుంది. మరో ప్రధాన నిరోధం 9600. 


బేరిష్‌ స్థాయిలు: మరింత కరెక్షన్‌లో పడి ప్రధాన మద్దతు స్థాయి 8800 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 8800. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌ తప్పదు. ప్రధాన మానసిక అవధి 8500. 

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీకి ప్రధాన నిరోధం 17500. మరింత అప్‌ట్రెండ్‌ కోసం అంతకన్నా పైన నిలదొక్కుకోవాలి. 


పాటర్న్‌: 9200 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద బ్రేకౌట్‌ సాధిస్తే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఉంటుంది. అలాగే ‘‘ఏటవాలుగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా కూడా పైకి రావాలి. 8800 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌ తప్పదు.  

టైమ్‌: ఈ సూచీ ప్రకారం వచ్చే బుధవారం తదుపరి రివర్సల్‌ ఉంది. వీక్లీ చార్టుల ప్రకారం మార్కెట్‌ గత వారంలో కనిష్ఠ స్థాయిలను తాకినందు వల్ల మరింత రికవరీ లేదా కన్సాలిడేషన్‌కే ఆస్కారం ఉంది.  


టెక్‌ మహీంద్రా (రూ.528) కొనుగోలు స్థాయిలకు చేరువలో..

రూ.530 ఎగువన అప్‌ట్రెండ్‌

మొదటి నిరోధం రూ.560

రెండో నిరోధం రూ.600

రూ.515 దిగువన డౌన్‌ట్రెండ్‌

మొదటి మద్దతు రూ.490

రెండో మద్దతు రూ.460


మంగళవారం స్థాయిలు

నిరోధం : 9120, 9200  

మద్దతు : 8950, 8880


www.sundartrends.in

Updated Date - 2020-05-25T05:56:36+05:30 IST