కొవిడ్‌ ఆస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత

ABN , First Publish Date - 2021-05-06T05:44:13+05:30 IST

మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా రెం డురోజులుగా సరఫరా లేకపోవడంతో సమ స్య ఎదురైంది.

కొవిడ్‌ ఆస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత

రెండురోజులుగా సరఫరాకాని వయల్స్‌ 


ఇబ్బందుల్లో కరోనా బాధితులు


మదనపల్లె క్రైం, మే 5: మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా రెం డురోజులుగా సరఫరా లేకపోవడంతో సమ స్య ఎదురైంది. కొవిడ్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం 120మంది కరోనా బాధితులు చికిత్స పొం దుతున్నారు. ఇందులో 20 వెంటిలేటర్‌ సౌక ర్యం, మరో వంద సాధారణ పడకలు. అయి తే బాధితులకు రోజూ ఒక డోస్‌  రెమ్‌డె సివిర్‌ ఇంజక్షన్‌ వేయాల్సి ఉంది. దీంతో బాధితలు త్వరగా కోలుకుంటారు. కాగా మంగళవారం ఉదయం నుంచి ఆస్పత్రిలో సూదిమందు అందుబా టులో లేదు. దీంతో కరోనా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అయితే సోమవారం నుంచి సరఫరా లేదని, ఉన్న స్టాకు పూర్తి చేసేశామని వైద్యులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో తక్షణం 500 డోస్‌లు పంపాలని వైద్యఆరోగ్యశాఖ అధికా రులకు ఇండెంట్‌ పంపామన్నారు. వారు స్పందించి సరఫరా చేయలేదన్నారు. దీంతో కొరత ఏర్పడినట్లు వారు అంటున్నారు. కరోనా బారినపడి ప్రైవేటు వైద్యం కోసం వెళితే జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఖర్చు భరించలేని ప్రజలు ప్రభుత్వాస్ప త్రులకొస్తే ఇక్కడ పడకలు, ఇంజక్షన్ల కొరత ఏర్పడుతోంది. దీంతో వైద్యులు చేసేదిలేక బాధితులను తిరుపతికి రెఫర్‌ చేస్తున్నారు. వారు  మార్గమధ్యంలోనే మరణిస్తున్నారు.  కొవిడ్‌ ఆస్పత్రి నుంచి ఇంజక్షన్లు తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రుల్లో విక్రయిస్తున్నట్లు ఇటీ వల ఆరోపణలు వచ్చాయి. దీంతో  మెడికల్‌ సూపరింటెండెంట్‌ సుబ్బరాం కొవిడ్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. ఇంజ క్షన్లు బయట విక్రయించినా, షార్టేజ్‌ వచ్చినా సిబ్బందిదే బాధ్యత అని చెప్పడంతో వారిలో వణుకు పుట్టుకుంది. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు గట్టిగా మందలించినట్లు సమాచారం. దీంతో మితి మీరిన డోస్‌లు పంపకుండా కాస్త తగ్గించి నట్లు తెలుస్తోంది. అధికారులు స్పందించి రెమ్‌డెసివిర్‌ సరఫరా చేయాల్సి ఉంది. 

Updated Date - 2021-05-06T05:44:13+05:30 IST