పల్లెల్లో పట్టాల కొరత

ABN , First Publish Date - 2021-04-09T06:30:52+05:30 IST

పల్లెల్లో పట్టాల కొరత ఏర్పడింది. ధా న్యం ఆరబోతకు పట్టాలు దొరుకక రైతులు ఇబ్బందులు ప డుతున్నారు. ఓ వైపు వాతావరణంలో అకాల మార్పులతో బెంబేలు ఎత్తుతున్న రైతులు వరికోతలు కోసేందుకు పోటీ ప డుతున్నారు. చేతికొచ్చిన ధాన్యాన్ని కోత కోసి కాపాడుకు నేందుకు పోటీ పడుతున్న రైతులు ధాన్యం ఆరబోసేందుకు పట్టాలు దొరకక అవస్థలు పడుతున్నారు. ప్రతిఏటా పట్టా ల వ్యాపారులు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి వరి కోతల సీజన్‌లో రెండు మూడు నెలల పాటు పట్టాలు అదె ్దకుఇచ్చి ఆ తరువాత స్వగ్రామాలకు వెళ్లేవారు.

పల్లెల్లో పట్టాల కొరత
బోధన్‌లో పట్టాలు విక్రయించేందుకు వచ్చిన ఆంధ్ర వ్యాపారి

బోధన్‌, ఏప్రిల్‌ 8: పల్లెల్లో పట్టాల కొరత ఏర్పడింది. ధా న్యం ఆరబోతకు పట్టాలు దొరుకక రైతులు ఇబ్బందులు ప డుతున్నారు. ఓ వైపు వాతావరణంలో అకాల మార్పులతో బెంబేలు ఎత్తుతున్న రైతులు వరికోతలు కోసేందుకు పోటీ ప డుతున్నారు. చేతికొచ్చిన ధాన్యాన్ని కోత కోసి కాపాడుకు నేందుకు పోటీ పడుతున్న రైతులు ధాన్యం ఆరబోసేందుకు పట్టాలు దొరకక అవస్థలు పడుతున్నారు. ప్రతిఏటా పట్టా ల వ్యాపారులు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి వరి కోతల సీజన్‌లో రెండు మూడు నెలల పాటు పట్టాలు అదె ్దకుఇచ్చి ఆ తరువాత స్వగ్రామాలకు వెళ్లేవారు. ఈ ఏడాది వరికోతల సీజన్‌ ప్రారంభం నుంచే కరోనా కేసులు పెరు గుతుండడంతో లాక్‌డౌన్‌ ఊహగానాలు మొదలుకావడంతో ఆంధ్ర ప్రాంతం నుంచి పట్టాల వ్యాపారులు రాకపోవడం తో పట్టాల కొరత ఏర్పడి రైతులు అవస్థలు ఎదుర్కొంటు న్నారు. ప్రతిఏటా మండల కేంద్రాలలో మేజర్‌ పంచాయతీ లలో పట్టాల వ్యాపారులు పట్టాలు అద్దెకు ఇచ్చి రైతులను ఆదుకునేవారు. రైతులకు సైతం అద్దెపట్టాలు దొరికే పరిస్థి తులు ఉండడంతో కోతల సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిఏటా కోతల సీజన్‌ను ముగిస్తు వస్తున్నారు. కానీ, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డా యి. పట్టాల వ్యాపారులు లేక పట్టాలు దొరకక రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు రెండు రోజులుగా వా తావరణంలో తీవ్ర మార్పులు సంభవించి వర్షపు సూచన లు కనిపిస్తుండడంతో రైతులు బెంబేలు ఎత్తుతున్నారు. కో తలు కోసేందుకు పోటీ పడి పట్టాలు దొరుకక ఇబ్బందుల పాలవుతున్నారు. 

తీవ్రమైన పట్టాల కొరత

జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం ఆరబోసే పట్టాల కొరత తీవ్రమైంది. ప్రతీరైతు వరికోత యంత్రాల ద్వారా ధాన్యం కోసి వాటిని ఆరబోయాలంటే పట్టాలు తప్పనిసరి గా మారాయి. ఒక్కో రైతుకు పదుల సంఖ్యలో పట్టాలు అ వసరం ఉండడంతో రైతులు అద్దె పట్టాల కోసం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రతిఏటా సీజన్‌లో ఆంధ్రప్రాం తం నుంచి పట్టాల వ్యాపారులు వచ్చి ఇక్కడ నివాసం ఏ ర్పర్చుకొని పట్టాలు అద్దెకు ఇచ్చేవారు. ఒక్కో పట్టా కిరాయి కి రోజుకు పది రూపాయల చొప్పున వసూలు చేసేవారు. ఒక్కో రైతు ధాన్యం కోసినప్పటి నుంచి ఆరబోసి కాటా ము గిసే వరకు సుమారు 10 నుంచి 15 రోజుల వరకు పట్టా లు అద్దెకు తీసుకుంటారు. ఆంధ్ర నుంచి వచ్చే పట్టాల వ్యా పారులు ఒక్కొక్కరు 2వేల నుంచి 3వేల పైనే పట్టాలను ప్రత్యేక వాహనాలలో తెచ్చి ఇక్కడ అద్దెకు ఇచ్చుకునేవారు. కానీ, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డా యి. కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడం లాక్‌డౌన్‌ ఆంక్ష లు ఉండవచ్చన్న ప్రచారం మొదలవడంతో ఆంధ్ర ప్రాం తం నుంచి పట్టాల వ్యాపారులు అరకొరగానే వచ్చారు. ప రిస్థితులు ఎలా ఉంటాయో అని భయాందోళనకు గురైన పట్టాల వ్యాపారులు పూర్తిస్థాయిలో ఈ ఏడాది రాలేదు. పల్లెల్లో పట్టాలకు కొరత ఏర్పడి భలే డిమాండ్‌ నెలకొంది. పట్టాలు దొరుకక రైతులు అవస్థలు పడుతున్నారు. 

ఓ వైపు వరికోతలు...

జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో వరికోతలు ముమ్మరంగా ఊపందుకున్నాయి. దాదాపు యంత్రాలతో వరికోతలు కావ డంతో పెద్దమొత్తంలో వరికోతలు కొనసాగుతున్నాయి. ఒ క్కో గ్రామంలో పదుల సంఖ్యలో వరికోతల యంత్రాలు కో తలు సాగిస్తుండడంతో రోజుకు వందల ఎకరాలలో వరికో తలు ముగిసిపోతున్నాయి. మరోవైపు కోసిన వరిధాన్యాన్ని ఆరబెట్టేందుకు పట్టాల కొరత ఏర్పడింది. పట్టాల వ్యా పారులు రాక పట్టాలు లేక వరి రైతులు ఇబ్బందుల పాల వుతున్నారు. వరికోతలు కోసేందుకు యంత్రాలు ఉన్న ధా న్యం ఆరబోసుకునేందుకు పట్టాలు లేకపోవడం రైతులకు విచిత్ర పరిస్థితిగా మారింది. గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం ఆరబోసుకునేందుకు పట్టాల కోసం రైతులు పోటీ పడుతు న్నారు. మరోవైపు వాతావరణంలో మార్పులు సంభవించి వర్షపు సూచనలు కనిపిస్తుండడంతో రైతులు ధాన్యం కోత లు జరిపేందుకు ధాన్యం నిల్వ చేసుకునేందుకు పట్టాల కోసం పోటీ పడుతున్నారు. ఒకవేళ అకాల వర్షం కురిస్తే ధాన్యం రాశులను కాపాడుకునేందుకు పట్టాలు తప్పనిసరి కావడంతో రైతులు ముందే అప్రమత్తం అవుతున్నారు. ప్ర భుత్వం సబ్సిడీ పైన అందించిన పట్టాలు అరకొరగా ఉం డడంతో ఇప్పుడు రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. అద్దె పట్టాలు సైతం దొరుకక అవస్థలు పడుతున్నారు. 

పట్టాలకు తీవ్ర డిమాండ్‌

మౌలాలి, పట్టాల వ్యాపారి

రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు పట్టాలు తప్పనిస రి అయ్యాయి. ఈ ఏడాది పట్టాలకు తీవ్ర డిమాండ్‌ నెల కొంది. కోతలన్నీ ఒకేసారి సాగుతుండడం పట్టాలకు డి మాండ్‌ ఏర్పడేలా చేసింది. 

Updated Date - 2021-04-09T06:30:52+05:30 IST