జిల్లాలో మాస్క్‌లు, స్ప్రే ల కొరత

ABN , First Publish Date - 2020-03-29T10:58:09+05:30 IST

కరోనా అనుమానితులను తరలించే అసొలేషన్‌ వార్డుల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది మాస్క్‌లు, స్ర్పే లేక ఇబ్బంది పడుతున్నారు.

జిల్లాలో మాస్క్‌లు, స్ప్రే ల కొరత

 వైద్యులు, సిబ్బందిని వెంటాడుతున్న సమస్యలు


 అనంతపురం వైద్యం, మార్చి28 : కరోనా అనుమానితులను తరలించే అసొలేషన్‌ వార్డుల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది మాస్క్‌లు, స్ర్పే లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం జిల్లా సర్వజనాస్పత్రిలో ఐసొలేషన్‌ విభాగం కీలకంగా పనిచేస్తోంది. తర్వాత హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఐసొలేషన్‌ కొనసాగు తోంది. ఇక్కడ పని చేసే ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ఎక్స్‌రే టెక్నీషియన్స్‌, నర్సులు, సెక్యూరిటీ గార్డ్స్‌కు ఎన్‌-95 మాస్క్‌లు లేవు. డాక్టర్లకు మాత్రం ఇస్తున్నారు. మిగిలిన సిబ్బందికి సాధారణ మాస్క్‌లతోనే విధులు నిర్వర్తింప జేస్తున్నారు. ఐసొలేషన్‌కు వెళ్లినప్పుడు, వచ్చినప్పుడు  స్ర్పే చేయాలి. అనుమానిత కేసులకు స్ర్పే చేయాల్సి ఉం టుంది. కానీ స్ర్పే కొరత కూడా తీవ్రంగా ఉంది. ఏదైనా వాహనంలో అనుమానిత కేసును తీసుకొస్తే ఆ వాహ నాన్ని స్ర్పే ద్వారా శుభ్రం చేయాలి. మూడ్రోజుల క్రితం కళ్యాణదుర్గం నుంచి కేసు వస్తే స్ర్పే లేక ఆ వాహనాన్ని అలాగే పంపించేశారని తెలిసింది. 


పీహెచ్‌సీల పరిధిలో మరీ ఘోరం....

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అయితే కరోనా నియం త్రణ చర్యలు మరీ ఘోరంగా ఉన్నట్లు ఆ వర్గాలు ఆవేద న చెందుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినోళ్ల వద్దకు ఈ సిబ్బంది వెళ్లాల్సి వస్తోంది. ఆయా ఇళ్లకు వెళ్లి దగ్గరుండి వైద్య పరీక్షలు చేయాలి. వారి ఆరోగ్య పరిస్థితులు రికా ర్డులలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 15 రోజులుగా వందలాది మంది వైద్యులు, సిబ్బంది ఈ పనిలోనే ఉన్నారు. తాజాగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు సర్వేలు చేయిస్తున్నారు. ఇందు కోసం 35 అంశాలతో ఒక ప్రొఫార్మా ఇచ్చారు. వారు విదే శాల నుంచి వచ్చిన వారి వద్దకెళ్లి ఆ ప్రొఫార్మా మేరకు సమాచారం సేకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ పని చేసే వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా సిబ్బందికి మాత్రం రక్షణ వసతులు కల్పించడం లేదు. మాస్క్‌లు ఇవ్వడం లేదు. శానిటైజర్‌ లేదు... సొం తంగా కుట్టిన మాస్క్‌లను కొనుగోలు చేసి తమ విధు లను కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది.


మరోవైపు పర్యవేక్షణకు, చైతన్యపరిచేందుకు వివిధ కమిటీలను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. వారికి కూడా కనీసం మాస్క్‌లు ఇవ్వలేని దుస్థితి జిల్లాలో ఉంది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు వారే సొంతంగా మాస్క్‌లు, రక్షణ పరికరాలు, శానిటైజర్స్‌ కొనుగోలు చేసుకుంటున్నారు. ఉ న్నతాధికారులు మాత్రం విధులు చేయాలని ఆదేశిస్తున్నా రు కానీ ఆ విధులు నిర్వర్తించే వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల రక్షణ విషయం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-03-29T10:58:09+05:30 IST